కొండగట్టు అంజన్న ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం

by GSrikanth |
కొండగట్టు అంజన్న ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం
X

దిశ, మల్యాల: కొండగట్టు అంజన్న ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. వివరాల్లోకి వెళితే.. ఆలయ హుండీకి సీల్ వేసేముందు పంచనామ నిర్వహించడం ఆనవాయితీ. భక్తులు సమర్పించిన తలనీలాలను భద్రపరచడానికి ఉపయోగించిన స్టీల్ పెట్టెకు పంచనామ నిర్వహించిన ఆలయ అధికారులు సంవత్సరాన్ని మార్చేయడం చర్చనీయాంశమైంది. 1 ఆగస్టు 2023 నుండి అని రాయకుండా 1 ఆగస్టు 2022 నుండి అని రాయడం విమర్శలకు దారి తీసింది. అంతేగాకుండా.. ఏఈఓ మొదలుకొని ఆలయ అధికారులు స్టాంప్‌తో కూడిన సంతకాలు చేయడం వారి నిర్లక్ష్య పూరిత పనితీరుకు అద్దం పడుతోంది. ఈ విషయం తెలిసిన స్థానిక ప్రజలు అధికారులు, ఆలయ సిబ్బంది విమర్శలు చేస్తున్నారు.


Next Story

Most Viewed