- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మన లక్ష్యం మనమే నిర్ణయించుకోవాలి : ఎమ్మెల్యే సైది రెడ్డి
దిశ, నేరేడుచర్ల : విద్యార్థులు తమ భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు సాగాలో ముందు నుంచే ప్రణాళికను తయారు చేసుకోవాలని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఆయన ఆధ్వర్యంలో నియోజకవర్గ ప్రభుత్వ గురుకులాల, మోడల్, కస్తూర్బా కళాశాలలకు చెందిన 200 మంది ఇంటర్ ద్వితీయ సంవత్సరం డిగ్రీ విద్యార్థిని విద్యార్థులకు హైదరాబాదులో తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా ఏర్పాటు చేసిన టీ-హబ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై అవగాహన కోసం ఒకరోజు విజ్ఞాన పర్యటనకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచంలో అగ్రగామి దేశాలలో ప్రధాన సంస్థలైన గూగుల్, మైక్రో సాఫ్ట్ వంటి కంపెనీలలో పని చేస్తున్న వారంతా మన ఇండియా వారేనని అన్నారు. ఆసక్తి కలిగిన వారికి అన్ని విధాలుగా సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని అన్నారు. గ్రామాలలో ఉండే విద్యార్థులకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని అన్నారు.