- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గ్రామ సర్పంచ్ పదవికి ఏకగ్రీవం..ఎక్కడంటే..?

దిశ, మానోపాడు: సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే గ్రామాల్లో వేడివేడిగా సమావేశాలు కొనసాగుతున్నాయి. ఓ గ్రామంలో మాత్రం ఏకగ్రీవం చేసుకున్నారని కూడా సమాచారం. ఆ గ్రామమే జోగులాంబ గద్వాల జిల్లాలోని మానోపాడు మండలము గోకులపాడు గ్రామం. ఆ గ్రామంలో ఉన్నది కేవలం 486 ఓట్లు మాత్రమే. కానీ ప్రత్యేక ఎన్నికల ఖర్చు మితిమీరి పోతుండడంతో..గ్రామస్తులు గ్రామంలో ఏకగ్రీవ చేసుకుందామని అనుకున్నారేమో..గ్రామంలో అందరూ కలిసి పాట పాడాలని అనుకున్నారు. నలుగురు వ్యక్తులు సర్పంచ్ పదవి కొరకు ఒకడిని మించి మరొకరు పోటీపడి ఏకంగా 27 లక్షల 50వేల రూపాయలకు వేలంపాట పాడారు. సర్పంచ్ ఎన్నికలు నోటిఫికేషన్ వెంటనే అమౌంట్ చెల్లించి సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసుకోవాలని తీర్మానం చేసుకున్నారు. ఈ విషయంపై గ్రామస్తులకు సమాచారం అడిగితే అలాంటిదేమీ లేదని కేవలం గుడి డెవలప్మెంట్ కొరకు మాత్రమే సమావేశం నిర్వహించుకున్నామని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా చిన్నపాటి గ్రామానికి ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ వేలంపాట పాడటం అంటే... పోటీలో నిలబడే వారికి ఇలాంటి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు పోటీలో నిలబడాలంటే కత్తిమీర సాము లాంటిది అనుకుంటున్నారు. నలుగురు పోటీ పడగా భీమరాజు అనే వ్యక్తి వేలం పాటలో 27 లక్షల 50 వేల వరకు సర్పంచ్ పదవిని దక్కించుకున్నట్లు సమాచారం.