Paper Leak Case: బండి సంజయ్ ఎక్కడున్నాడో..?.. ఆందోళనలో బీజేపీ కార్యకర్తలు

by srinivas |   ( Updated:2023-04-05 10:06:18.0  )
Paper Leak Case: బండి సంజయ్ ఎక్కడున్నాడో..?.. ఆందోళనలో బీజేపీ కార్యకర్తలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ పదో తరగతి హిందీ పేపర్ లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ప్రస్తుతం బండి సంజయ్ ఎక్కడున్నడో తెలియక గందరగోళ పరిస్థితి నెలకొంది. సరైన సమాచారం లేకపోవడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆయోమయానికి గురవుతున్నారు. అటు పోలీసులు కూడా ఎక్కడా వివరణ ఇవ్వకపోవడంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే బండి సంజయ్ వరంగల్ పీటీసీలో ఉన్నట్లు తెలుస్తోంది. పాలకుర్తిలో వైద్య పరీక్షలు నిర్వహించారని.. ఆ తర్వాత బండి సంజయ్‌ను పోలీసులు రహస్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు సమాచారం. మరికాసేపట్లో హనుమకొండ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో హనుమకొండ కోర్టు పరసరాల ప్రాంతాలకు బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడ హంగామా పరిస్థితి కనిపిస్తోంది.

Advertisement
Next Story

Most Viewed