- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి..
దిశ, కనగల్లు : గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని గ్రామపంచాయతీ కార్మికుల జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా కనగల్లు మండలంలోని రేగట్టే, శబ్దలాపురం, జి.యడవల్లి, గ్రామాలలో బైక్ ర్యాలీ నిర్వహించి కనగల్లు మండల కేంద్రంలో పంచాయతీ కార్మికుల సమస్యల పై నాలుగవరోజు సమ్మెలో ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుండా సమ్మెను విచ్చినం చేయడం కోసం కార్మికులను తొలగించి కొత్తవారిని పెట్టుకుంటామని పంచాయతీ అధికారులు కార్మికులను బెదిరించడం సరైన పద్ధతి కాదని వినోద్ కుమార్ పేర్కొన్నారు. గత తొమ్మిది సంవత్సరాల నుంచి గ్రామపంచాయతీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం శ్రమ దోపిడీ చేస్తుందని అన్నారు. కార్మిక చట్టాలను అమలు చేయకుండా కార్మికులతో వేట్టి చాకిరి చేస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులందరినీ ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని వేతనాలకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి ట్రెజరీల ద్వారా వేతనాలు ఇవ్వాలని పిఆర్సి లో నిర్ణయించిన మినిమం బేసిక్ 19 వేల రూపాయలు చెల్లించాలని కారో బార్లు, బిల్ కలెక్టర్లను, సహాయ కార్యదర్శులుగ నిర్మించాలని ఆయన అన్నారు. వీధి నిర్వహణలో ప్రమాదం జరిగి మరణించి కార్మికుల కుటుంబానికి 10 లక్షలు చెల్లించాలి అని అన్నారు.
ప్రతి గ్రామపంచాయతీ కార్మికునికి పీఎఫ్, ఈఎస్ఐ ప్రమాద బీమా గ్రాడ్యుటి గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి అన్ని కార్మికచట్టాలు అమలు చేయాలని ట్రాక్టర్ డ్రైవర్లకు గ్రామపంచాయతీ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించాలని కార్మికుల పై వేధింపులు అక్రమంగా తొలగింపు వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యవర్గ సభ్యులు కానుగు లింగస్వామి, బండ్ల శంకర్, గట్టిగుండ్ల భిక్షం, నరాల మారమ్మ, నగేష్, తలారి సాగర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.