- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వైభవోపేతంగా స్వామి వారి బంగారు విమాన గోపుర సంప్రోక్షణ..

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బంగారు విమాన గోపురం వైభవోపేతంగా, దేశంలోనే ఎత్తైన స్వర్ణ గోపురం స్వామివారికి అంకితం అయింది. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బంగారు విమాన గోపుర మహాకుంభాభిషేకం, సంప్రోక్షణ మహోత్సవ కార్యక్రమం ఉదయం 11.54 గంటలకు వానమామలై మఠం 31 పీఠాధిపతులు మధుర కవి రామానుజ జీయర్ స్వామి దివ్య మంగళ శాసనాలతో వేద పండితులు, రుత్విక్కులు, పారాయణాలు, భక్తుల జయజయధ్వానాలు, వేదమంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య సీఎం రేవంత్ రెడ్డి స్వామివారి బంగారు విమాన గోపురాన్ని లక్ష్మీనరసింహస్వామి వారికి అంకితం ఇచ్చారు. రోడ్డు మార్గం ద్వారా హైదరాబాదు నుంచి యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.
అక్కడి నుంచి పంచకుండాత్మక యాగం జరిగిన యాగస్థలికి చేరుకొని మహా పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఉత్తర రాజగోపురం నుంచి నేరుగా స్వర్ణ గోపురం పైకి చేరుకున్నారు. మహా సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం త్రితల రాజగోపురం నుంచి ఆలయంలోకి చేరుకున్నారు. ఆయన వెంట సీఎస్ శాంతికుమారి, ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బాలు నాయక్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కలెక్టర్ హనుమంతరావు, ఈవో భాస్కర్ రావు, బండ్రు శోభారాణి, అమిత్ రెడ్డి తదితరులు ఉన్నారు.