Electricity Department : విద్యుత్ శాఖలో నడుస్తుంది ఆయన జమానా ?

by Sumithra |
Electricity Department : విద్యుత్ శాఖలో నడుస్తుంది ఆయన జమానా ?
X

దిశ, ఆలేరు : యాదాద్రి భువనగిరి జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం (ఆపరేషన్ ) లో అతను ఒక ఉన్నతాధికారి కాదు, కనీసం సంస్థలో చిన్నపాటి ఉద్యోగి కూడా కానే కాదు, లేదా ఔట్సోర్సింగ్ ఉద్యోగైనా కాదు. ఆయన కేవలం ఒక కాంట్రాక్టర్ మాత్రమే. కానీ యాదాద్రి భువనగిరి డివిజన్లోని డీఈఈ కార్యాలయంతో పాటు, భువనగిరి డివిజన్ లోని వివిధ మండలాల్లోని "విద్యుత్ శాఖలో నడుస్తుంది ఆయన జమానా?"

అధికారులకు బెదిరింపులు ?

భువనగిరి డివిజన్ పరిధిలోని ఏ మండలంలోనైనా ఆయన కన్నేసిన విద్యుత్ కాంట్రాక్ట్ పనులు తనకె కేటాయించాలని అధికారుల మీద ఒత్తిడి తెస్తాడు. లేదంటే గతంలో అధికారుల పై జరిగిన ఏసీబీ దాడుల మాదిరిగానే మీ మీద జరుగుతాయని అధికారులను బెదిరిస్తూ బుకాయిస్తాడు. పై విషయాలన్ని తమ పేర్లు చెప్పేందుకు ఇష్టపడని కొంతమంది విద్యుత్ శాఖ అధికారులు "దిశ "తో తమ గోడు చెప్పుకున్నారు. అలాగే కొంతమంది రాజకీయ ప్రముఖుల పేర్లను సైతం చెప్పుకొని, తన తప్పుడు పనులను అధికారులతో బలవంతం చేసి చేయించుకుంటున్నాడని. ఆ విషయాలు బహిర్గతం అయితే మధ్యలో తామే సమిదలై పోతున్నామని వారు వాపోయారు. గత కొద్దిరోజుల క్రితం చేయని పనులకు బిల్లులు పెట్టడంతో ఆ విషయాలు బయటకు పొక్కడంతో కొంతమంది అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

తనమాటే నెగ్గించుకున్న కాంట్రాక్టర్..

గత జూలైలో నెలలో డీఈఈ కార్యాలయంలో రాజపేట మండలంలో 11 కేవీ షిఫ్టింగ్ పనుల కోసం అధికారులు టెండర్లకు పిలిచారు. ఈ పనులను చేసేందుకు ఓ కాంట్రాక్టర్ ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే 15 శాతానికి లెస్ గా కోట్ చేశాడు. ఈ కాంట్రాక్టర్ మాత్రం ప్రభుత్వ నిర్ణయించిన ధర కంటే కేవలం ఒక శాతానికి మాత్రమే పనులు చేసేందుకు కోట్ చేశాడు. ఈ విషయంలో అధికారులు 15% లెస్ వేసిన కాంట్రాక్టర్ కే అధికారులు ఈ పనులు అప్పగించాలి. కానీ అలా కాకుండా ఒక శాతానికి లెస్ గా వేసిన కాంట్రాక్టర్ కే అధికారులు అప్పగించారు. ఈ విషయంలో సంస్థకు నష్టం జరుగుతున్నప్పటికీ అధికారులు ఈయనకే సపోర్ట్ చేయడం పట్ల ఆయన ఏ విధంగా అధికారులను ప్రభావితం చేస్తున్నాడో దీన్ని బట్టి తెలుస్తుంది.

టెండర్ పనులు నాకే కేటాయించాలి ?

వచ్చే నెల 1న భువనగిరి డీఈఈ కార్యాలయం పరిధిలోని వివిధ మండలాల్లో పనులు చేసిందుకు గాను విద్యుత్ శాఖ టెండర్లు పిలిచేందుకు నోటిఫికేషన్ ( 2 ) ద్వారా జారీ చేసింది. వీటిలో ఆలేరు నియోజకవర్గంలోని బొమ్మలరామారం మండలంలో 11 కేవీ బ్రేకర్ ఫీడర్ (2) పనులు గాను, భువనగిరి నియోజకవర్గంలోని బీబీనగర్ మండలంలో(1) బ్రేకర్ ఫీడర్ పనులగాను రిజర్వేషన్ జనరల్ కు కేటాయించి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ టెండర్ ను ఒకటవ తేదీన అధికారులు ఓపెన్ చేయనున్నారు. ఈ విషయంలో సంబంధిత కాంట్రాక్టర్ ఆయా పనులకు సంబంధించిన బడ్జెట్ నేనే మంజూరు చేయించానని ఆ కాంట్రాక్టు పనులు నాకే అప్పగించాలని ఇప్పటి నుంచే అధికారుల పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈ పనుల కోసం వేరే కాంట్రాక్టర్ల ను సైతం టెండర్ వేయొద్దని బుకాయిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో అధికారులు ఆ కాంట్రాక్టర్ కు తలుగ్గోతారా ? లేదా టెండర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తారా, లేదా అనే విషయం ఆసక్తిగా చూస్తున్నారు.

Advertisement

Next Story