అనుమతులు లేకుండా విగ్రహాలు ప్రతిష్టిస్తే కఠిన చర్యలు తప్పవు: డీసీపీ రాజేష్ చంద్ర

by Aamani |   ( Updated:2023-03-17 13:19:50.0  )
అనుమతులు లేకుండా విగ్రహాలు ప్రతిష్టిస్తే కఠిన చర్యలు తప్పవు: డీసీపీ రాజేష్ చంద్ర
X

దిశ భూదాన్ పోచంపల్లి: జిల్లా వ్యాప్తంగా ,గ్రామాలలో పట్టణాలలో,ప్రధాన రోడ్డు డివైడర్ మధ్యలో కానీ, ప్రభుత్వ స్థలాల్లో కానీ జాతీయ నాయకుల, కుల చిహ్నాల,వీరయోధులకు సంబంధించిన విగ్రహాలను ఆయ సంఘాల ప్రతినిధులు ఎలాంటి అనుమతులు లేకుండా ఎవరికి తోచినట్లు వారు ప్రతిష్టిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని హెచ్చరిస్తూ, ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యదాద్రి భువనగిరి జిల్లా డిసిపి సతీష్ చంద్ర స్థానిక ఎస్సై సైదిరెడ్డి ద్వారా శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. జిల్లా పరిధిలో ఇటీవల కాలంలో కొంతమంది ఎటువంటి అనుమతులు లేకుండా విగ్రహాలను ప్రభుత్వ స్థలంలో పెట్టె ప్రయత్నం చేస్తున్నారని వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందనీ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ స్థలంలో అనుమతులు లేకుండా ఎటువంటి విగ్రహాలని ఆవిష్కరించిన చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారందరిని పరిమిత కాలమైన ఒక ఏడాది పాటు సంబంధిత ఎమ్మార్వోముందు బైండ్ ఓవర్ కూడా చేయబడుననీ తెలిపారు.గ్రామ పంచాయతీ తీర్మానం గాని పంచాయతీ కార్యదర్శి గాని ప్రభుత్వ స్థలంలో విగ్రహాలను పెట్టమని అనుమతులు ఇవ్వడానికి అర్హులు కారు. కేవలం జిల్లా కలెక్టర్ మాత్రమే అందుకు అనుమతులు ఇవ్వవలసి ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని,ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ యాదాద్రి జోన్ లో ప్రజలందరికీ ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed