- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Breaking News : పతంగి ఎగరేస్తూ జూపల్లి నరేందర్ మృతి
by M.Rajitha |

X
దిశ, వెబ్ డెస్క్ : పండగపూట ఆనందంగా గడపాల్సిన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సరదాగా గాలిపటం(Kite) ఎగరవేస్తూ ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి భవనంపై నుంచి పడి ప్రాణాలు విడిచాడు. పోలీసుల వివరాల ప్రకారం.. యాదాద్రి(Yadadri) జిల్లా మూటకొండూర్ మండలం అమ్మనబోలు గ్రామానికి చెందిన జూపల్లి నరేందర్ అనే వ్యక్తి.. పిట్టగొడ లేని భవనంపై గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తూ కింద పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన నరేందర్ ను కుటుంబ సభ్యులు, స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో పండగపూట అమ్మనబోలు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story