- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భగ్గుమన్న నల్లగొండ బీజేపీ.. చిరుమర్తి నాలుక చీరేస్తాం అని వార్నింగ్
దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో గడియారం సెంటర్లో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దిష్టిబొమ్మను బీజేపీ నేతలు దగ్ధం చేశారు. అలాగే నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిన్న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నకిరేకల్‌లో చేసిన నిరసన కార్యక్రమంలో అక్కడి శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. అసభ్య పదజాలంతో బండి సంజయ్ భార్య, బీజేపీ నాయకుల భార్యలకు బీఆర్ఎస్ నాయకులు అందరూ మీ భార్యలకు ముద్దులు పెడతారు అని మాట్లాడి మహిళ లోకాన్ని కించ పరిచాడు.
ఎమ్మెల్యేను వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యే పదవికి నుండి సస్పెండ్ చేయాలని, మహిళలకు ఆయన భేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి పోతే పాక సాంబయ్య చిరుమర్తి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే దీని పత్రులు జాతీయ మహిళ కమిషన్‌కి, రాష్ట్ర మహిళ కమిషన్ కి పంపుతున్నట్లు స్టేషన్లో చిరుమర్తి మాట్లాడిన వీడియో కాపీని జతపరిచినట్లు తెలిపారు.
అది నాలుక పెంట నా.. చిరుమర్తి
ఏదో సాదా సీదాగా అడిగిన ప్రశ్నకు కవిత అక్కను అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా అని చెప్పిన సమాధానంని రాష్ట్ర వ్యాప్తంగా ఏదో జరిగిపోయినట్టు చేశారు. అలాగే నకిరేకల్ ఎమ్మెల్యే అయితే నోటికి వచ్చినట్లు బీజేపీ నాయకుల భార్యలను ముద్దు పెట్టుకోండి అని అనడం మహిళ సమాజంని చులకనగా మాట్లాడటం సిగ్గుచేటు అని అన్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి భేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.
లేదంటే మహిళలు అంతా కలిసి ఆ నాలుక కోస్తాం అని అది నాలుక లేక పెంట నా అని అన్నారు. ఈ కార్యక్రమంలో గోలి మధుసుధన్ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు, వీరెల్లి చంద్ర శేఖర్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నాయకులు గడ్డం మహేష్, చర్లపల్లి గణేష్, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు నీరజ, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి రవేళ్ళ కాశమ్మ, మహేష్, నర్సిహ్మ తదితరులు పాల్గొన్నారు.