రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించిన ఎంపీ ఉత్తమ్

by Mahesh |   ( Updated:2023-05-21 08:17:57.0  )
రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించిన ఎంపీ ఉత్తమ్
X

దిశ, హుజూర్ నగర్: భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని నల్గొండ ఎంపీ ఉత్తమ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ తన చివరి ఊపిరి ఉన్నంత వరకు దేశం కోసం అవిశ్రాంతంగా శ్రమించారన్నారు. అలాగే భారతదేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేశారని, నేటి భవిష్యత్ తరాల కోసం ముందుచూపుతో ఆలోచించి ఆనాడే ఐటీ రంగానికి పునాదులు వేసిన గొప్ప వ్యక్తి అని కోనియాడారు.

అలాగే.. రాజీవ్ గాంధీ ఆలోచనల వలనే నేడు దేశం ఐటీ రంగంలో ముందుకు దూసుకెళ్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే సౌత్ సెంట్రల్ జోనల్ నెంబర్ యరగాని నాగన్న గౌడ్, మాజీ జెడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు, పీసీసీ సభ్యులు దొంగర వెంకటేశ్వర్లు, మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎండి నిజాముద్దీన్, మఠంపల్లి మండల అధ్యక్షుడు భూక్య మంజు నాయక్, మున్సిపల్ కౌన్సిలర్స్ కారంగుల విజయ వెంకటేశ్వర్లు, బొల్లెద్దు ధనమ్మ, పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్, బాచిమంచి గిరిబాబు, నూకల సందీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Also Read...

నేడు పొంగులేటి కీలక ప్రకటన.. మాజీ MP రాజకీయ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ..?

Advertisement

Next Story