- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణలో అమానవీయ ఘటన.. మైనర్ బాలిక శీలం ఖరీదు రూ.5 లక్షలు

దిశ, నల్లగొండ బ్యూరో: ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకుని.. ఆమె శీలానికి ఖరీదు కట్టిన అమానవీయ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కట్టంగూరు మండల పరిధిలోని ఎరసానిగూడెం గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను సుమారు ఆరేళ్ల క్రితం నార్కట్‌పల్లి మండల పరిధిలోని చిప్పలపల్లి గ్రామానికి చెందిన వెంకన్న (25) అనే యువకుడు మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకున్నాడని సమాచారం. దీంతో ఆ మైనర్ బాలిక గర్భం దాల్చింది. ఆ బాలిక గర్భంతో ఉండగానే సదరు యువకుడు వేరే అమ్మాయితో వివాహం చేసుకున్నట్లుగా సమాచారం. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని మైనర్ బాలిక 20 ఏప్రిల్ 2018 కట్టంగూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సదరు యువకుడిపై కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే డీఎన్ఏ పరీక్ష నిమిత్తం 2019 మే నెలలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కూడా పంపితే మైనర్ బాలిక గర్భానికి కారణం వెంకన్న అనే విషయం కూడా బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో విచారణలో ఉందని, మోసం చేసిన యువకుడికి శిక్ష పడడం ఖాయమని విశ్వసనీయవర్గాల సమాచారం. శిక్ష తప్పదని భావించిన యువకుడు బాధిత మైనర్ బాలికతో రాజీ కుదుర్చమని ఇద్దరు పెద్ద మనుషులను రంగంలోకి దింపాడు. ఆ పెద్ద మనుషులు బాలిక శీలానికి ఖరీదు కడుతూ.. రూ.5 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. అందులో రూ.3.50 లక్షలు పెద్ద మనుషుల పేరుతో పట్టణంలోని ఓ ప్రైవేటు బ్యాంకులో జాయింట్ బ్యాంక్ అకౌంట్ తెరిచి ఖాతాలో జమ చేసినట్లు. మిగతా రూ.1.50 లక్షలు కేసు ముగిసిన వెంటనే అందజేసే విధంగా పెద్ద మనుషులు డీల్ సెట్ చేసినట్లుగా తెలుస్తోంది.