- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయన ఏ పార్టీలో ఉంటాడో ఆయనకే తెలియదు : ఎమ్మెల్యే
దిశ, గరిడేపల్లి: నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తల చెబితే ఎన్నికల్లో పోటీ చేయను అని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని పోనుగోడు గ్రామంలో ఎంబీయార్ ఫంక్షన్ హాల్ లో జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ బూత్ స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో మరెక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. గత 20 సంవత్సరాల నుంచి చేయని అభివృద్ధి నాలుగున్నర ఏళ్ళలో చేసి నిరుపించానని, ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి అత్యధిక మెజార్టీ సాధించేందుకు కృషి చేయాలన్నారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతి గ్రామానికి , అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించేలా కృషి చేశానని తెలిపారు. ఏ కార్యకర్త ఆపదలో ఉన్న, ఎంత అర్ధ రాత్రి ఫోన్ చేసి తమ సమస్య చెప్పుకున్న వారి సమస్యలు పరిష్కరించానని, కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటున్న సైదన్న కావాలో, ఉత్తమ్ సార్ కావాలో నిర్ణయించుకోవాలన్నారు. నేను ఎమ్మెల్యే గా గెలవక ముందు ఒక ఎమ్మెల్యేని కలవాలంటే ఒక బ్రోకర్ ని వెంట పెట్టుకొని కలవాల్సి వచ్చేదని, కానీ నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ సాంప్రదాయానికి ముగింపు పలికి అందరికీ అందుబాటులో ఉన్నానన్నారు. 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా , ఎంపీగా చేసిన ఉత్తమ్ డ్రైవర్ లేకుండా నియోజకవర్గంలోని ఒక గ్రామం పేరు చెబితే, ఆ గ్రామానికి ఒంటరిగా రావాలని సవాల్ విసిరారు. ఉత్తమ్ ఏ పార్టీలో ఉంటాడో తెలియదని, ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు ఆయన బీఆర్‌ఎస్‌లోకి వస్తాడనే ప్రచారం జరిగిందన్నారు.
ఇది గమనించిన వాళ్ళ పార్టీ అధిష్టానం భార్య, భర్తలకు టిక్కెట్లు కేటాయించి, కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలో చోటు కల్పించిందన్నారు. రాబోయే 40 రోజులు ఎంతో కీలకమని, నా బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉంచుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మండల ఇంఛార్జ్, నేరేడుచర్ల వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మి నారాయణ, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గుగులోతు కృష్ణ నాయక్, ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పెండెం శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ గుత్తికొండ ప్రమీల వెంకటరమణరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఒక్కవంతుల పార్థసారధి, మార్కెట్ కమిటీ డైరెక్టర్‌లు వీరయ్య, అంజి, దస్తగిరి, పీఏసీస్ చైర్మన్లు శంభిరెడ్డి, రామయ్య, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు శ్రీహరి, మండల యూత్ అధ్యక్షుడు నాగేశ్వర్ రావు, అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.