ఎమ్మార్పీఎస్ కు గాదరి కిషోర్ క్షమాపణ చెప్పాలి.. మహాజన సోషలిస్టు పార్టీ..

by Sumithra |
ఎమ్మార్పీఎస్ కు గాదరి కిషోర్ క్షమాపణ చెప్పాలి.. మహాజన సోషలిస్టు పార్టీ..
X

దిశ, పీఏపల్లి : పీఏపల్లి మండల కేంద్రంలో మహాజన సోషలిస్టు పార్టీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అత్యవసరంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహాజన సోషలిస్టు పార్టీ నల్లగొండ జిల్లా ఇంచార్జి ఆడెపు నాగార్జున మాదిగ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. నియోజకవర్గ ఎంఆర్పీఎస్ ఇంచార్జ్ పోతేం సహదేవుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సభలో స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ నాయకులను కొడుకులుగా వర్ణిస్తూ దళిత బంధు పథకాన్ని ఇచ్చామంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దళిత బంధు పథకాన్ని కిషోర్ ఇంట్లో నుంచో తన అయ్యా ఆస్తులు అమ్మి అమలు చేయడం లేదని అన్నారు.

తనలాగా ఇసుక మాఫియాలో కోట్లాది రూపాయలు ఎంఆర్పీఎస్ నాయకులు సంపాదించలేదన్నారు. అణగారిన వర్గాలైన పేద ప్రజలందరి కోసం కూడా ఎమ్మార్పీఎస్ నాయకత్వం గత 30 సంవత్సరాలుగా సామాజిక న్యాయమే దిక్సూచిగా ఉద్యమాలు చేస్తూ సమాజంలోని సబ్బండ కులాలకు పేద వర్గాల హక్కులకై పోరాడి ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. గాదరి కిషోర్, కేసీఆర్ కు పెంపుడు కుక్కలా వ్యవహరిస్తూ దళితుల పై, అణగారిన వర్గాల పై తెలంగాణ రాష్ట్రంలో దొరలు రాచరిక పాలన కొనసాగిస్తూ ఉంటే కేసీఆర్ వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఏ సామాజిక వర్గం నుంచి అయితే వచ్చిండో ఆ సామాజిక వర్గాలను అవమానంగా మాట్లాడటం సరికాదన్నారు.

కేసీఆర్ విషకౌగిలిలో ఉండి బలుపెక్కిన మాటలు మాట్లాడుతున్నాడని తక్షణమే గాదరి కిషోర్ ఎమ్మార్పీఎస్ నాయకులకు క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో తుంగతుర్తి నియోజకవర్గంలో గాదరి కిషోర్ గుడ్డలు విప్పి, చెప్పుల దండలు వేసి బజారు వెంట పిచ్చికుక్కను కొట్టినట్టు తరిమితరిమి కొడతారాని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో మహాజన సోషలిస్టు పార్టీ దేవరకొండ నియోజకవర్గం ఇంచార్జి మారుపాక గోపాల్, ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జ్ పేర్ల కొండల్, ధర్మపురం చిరంజీవి, మద్దిమడుగు నాగరాజు, బోడ యాదయ్య, బోడ మహేష్ మద్దిమడుగు నగేష్, పోతే అంబేడ్కర్, ధర్మపురం అనిల్, పేర్ల నరేష్, పేర్ల నాగార్జున, పొతేం మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story