- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఓపెన్ ఇంటర్ పరీక్షలో కాంగ్రెస్ నాయకుడి భార్య నిర్వాకం.. వేరే మహిళతో పరీక్ష రాయిస్తుండగా..
దిశ, వెబ్‌డెస్క్: ఓపెన్ ఇంటర్ పరీక్షలో కాంగ్రెస్ నాయకుడి భార్య మాల్ ప్రాక్టీస్ చేయించి.. అడ్డంగా దొరికిపోయింది. సూర్యాపేట-హుజూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా.. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు భూక్యా మంజి నాయక్ భార్య కాంగ్రెస్ నాయకురాలు మఠంపల్లి మాజీ ZPTC ధీరవత్ నీలా (అలియాస్ భూక్యా నీలా) పరీక్ష రాసేది ఉంది. కాగా తనకు బదులుగా చింతలపాలెం మండలం నక్కగూడెం గ్రామానికి చెందిన భూక్యా నాగమణి అనే మహిళతో పరీక్షలు రాపించుకుంటుంది. ఇది గమనించిన ఇన్విజిలేటర్ షేక్ ఉస్మాన్ పరీక్షపై ఆరా తీయగా తేజ స్కూల్ కోఆర్డినేటర్ గురువయ్య మధ్య వర్తి ద్వారా పరీక్షలు రాస్తున్నానని భూక్యా నాగమణి నిజం ఒప్పుకుంది. మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారని కాంగ్రెస్ నాయకురాలు ధీరవత్ నీలా, నాగమణి, గురవయ్య ముగ్గురుపై పోలీస్ శాఖ FIR NO:108/2024 IPC: 419,420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.