- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైన్ షాపులో దొరకని మద్యం.. బెల్టు షాపులో లభ్యం..
దిశ, మర్రిగూడ : ప్రభుత్వాన్నిబంధనలకు విరుద్ధంగా మండల కేంద్రంలో ఉన్న వైన్ షాపుల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మార్పీ ధరలు కంటే అదనంగా వసూలు చేస్తూ వైన్స్ యజమానులు కిక్కులో తూర్పు సంపాదిస్తున్నారు. వైన్స్ యజమానులు ఒక ప్రైవేటు వ్యక్తికి నౌకర్దారులుగా నియమించి నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మార్పీ ధరల కంటే అదనంగా వసూలు చేస్తున్నారు. వైన్ షాపులో దొరకనే బ్రాండ్లు బెల్ట్ షాప్ లో వద్ద దొరుకుతుండడంతో మందుబాబులు వైన్స్ యజమానుల పై ఎక్సైజ్ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు షాపుల ఒకే క్యాంపస్ లో ఉన్నాగాని రెండు షాపులు రిటైల్ అమ్మకాలు కొనసాగిస్తుండగా పద్మావతి వైన్ షాపు హోల్సేల్ ధరలకు విక్రయిస్తూ యదేచగా మత్తు సామ్రాజ్యాన్ని కొనసాగిస్తున్నారు.
మండల వ్యాప్తంగా అక్రమంగా 500 పై చిలుకు బెల్ట్ షాపులు 24గంటలు తెరిచే ఉంటున్నాయి. కల్తీ మద్యానికి తోడు మండలంలోని అన్ని గ్రామాలలో గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా జరుగుతుందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రంలో ఉన్న 3 వైన్ షాపులను టెండర్ లో దక్కించుకున్న యజమానులు రింగ్ అయి ఒక ఇల్లీగల్ వ్యక్తికి షాపుల నిర్వహణ అప్పజెప్పి యదేచ్చగా కల్తీమద్యానికి పాల్పడుతున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. కల్తీ మద్యం సేవించిన దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలవారు అనారోగ్యంపాలై మూడు పదుల వయసులోనే తనువు జాలించడంతో ఆ కుటుంబాలు వీధిన పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యం తయారీ మూలలు మర్రిగూడ మండలంలో ఉన్నవిషయం పాఠకులకు విధితమే. కల్తీమద్యం పై తూతూ మంత్రంగా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకుని మామ అనిపించారు.
దీంతో వైన్స్ నౌకరి దారి యదేచ్ఛగా కల్తీ మద్యం విక్రయిస్తు కోట్లకు పడగలెత్తుతూ సామాన్యుల జీవితాలతో చెలగాటమారుతున్నాడని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేపర్లో వచ్చిన వెంటనే అప్రమత్తమయ్యే అధికారులు ఆ తరువాత చర్యలు తీసుకోకపోవడంతో కల్తీ మద్యం సరఫరా యదేచ్చగా జరుగుతున్నట్లు మహిళలు ఆరోపిస్తున్నారు. మండలంలోని 20గ్రామ పంచాయతీల్లో 500 పై చిలుకు బెల్ట్ షాపులు 24 గంటలు ఓపెన్ చేసి ఉండడంతో సామాన్యుల కుటుంబాలు మద్యం మత్తులో చిత్తవుతున్నాయి. ముఖ్యంగా మండల కేంద్రంలోనే ఒకే ఇంటికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మూడుపదుల వయసులోనే మద్యానికి బానిసై కల్తీ మద్యం సేవించి అసువులు బాయడంతో ఆ చిన్నారులు ఆ కుటుంబం రోడ్డునపడింది.
వైన్స్ నిర్వహనపై ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఎంఆర్పీ ధరలకంటే ఎక్కువ విక్రయించడంతో ఇటీవల వైన్ షాపుల ముందు పెద్దఎత్తున ఆందోళన జరిగింది. వైన్స్ యజమానులు చేస్తున్న లీగల్ కార్యకలాపాల పై పెద్దఎత్తున నిగాపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైన్ షాప్ ముందర ఎమ్మార్పీ ధరల కంటే అదనంగా నౌకరిదారి వసూలు చేయడంతో మందుబాబులు వీరంగం సృష్టించడంతో స్థానిక పోలీసులు రంగంలోకి దిగి మందుబాబులను సమ్జాయిస్తున్నారు. కల్తీ మద్యం సరఫరా, అక్రమంగా 24 గంటలు నిర్వహిస్తున్న బెల్ట్ షాపులు పై అధికారులు చర్యలు తీసుకోవాలని మండలప్రజలు కోరుతున్నారు.
ఎమ్మార్పీ ధరల కంటే అదనంగా వసూలు..
నిబంధనలకు విరుద్ధంగా మండల కేంద్రంలోని వైన్ షాపులు ఎమ్మార్పీ ధరలకంటే ప్రతి బ్రాండ్లో అదనంగా పది రూపాయలు నుండి 40 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. మద్యం ప్రియులకు అవసరమైన బీర్ల పై పది రూపాయలు, 90 ఎంఎల్ పై పది రూపాయలు, కొన్ని పావు బాటిల్ల పై 20 రూపాయలు, ఆఫ్ పై 20, ఫుల్ బాటిల్ పై 40, అదనంగా వసూలు చేస్తున్నారు. లైసెన్స్ ఓల్డర్స్ స్థానికంగా ఉండకుండా ఒక నౌకరిదారి ఆధీనంలో వైన్స్ ను నిర్వహించడంతో యదేచ్ఛగా ఎమ్మార్పీ ధరలకంటే అదనంగా వసూలు చేస్తూ మందుబాబుల జేబులకు చిల్లులు కొడుతున్నారు.
కల్తీ మద్యం అమ్మకాలు..
మండల కేంద్రంలోని వైన్ షాపులలో కల్తీ మద్యం యదేచ్చగా కొనసాగుతున్నాయి. పది నెలల వ్యవధిలోనే కల్తీ మద్యం సేవించిన దారిద్రపు రేఖకు దిగువన ఉన్న వ్యక్తులు 40 మంది పైనే మృత్యువాత పడ్డారు. కుటుంబ సభ్యులు పెద్దదిక్కుని కోల్పోవడంతో ఆ కుటుంబాలు వీధిన పడ్డాయి. కల్తీ మద్యం పై అధికారులు గత నాలుగు నెలల కిందట తూతూమంత్రంగా చర్యలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కల్తీ మద్యంతో పిట్టలు రాలినట్టు రాలుతున్న ఎక్సైజ్ అధికారులు కఠినమైన చర్యలు తీసుకోకపోవడంతో మండల ప్రజలు ఎక్సైజ్ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి..
సాగర్ హైవే రోడ్డు పై ఉన్న మాల్ కేంద్రంగా డ్రగ్స్, గంజాయి దందా యదేచ్ఛగా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మర్రిగూడ నుండి మాల్ రహదారి పైన ద్విచక్ర వాహనదారులు ఢీకొని ఇద్దరు చనిపోయిన వ్యక్తులు సైతం గంజాయి మత్తులోనే ఉన్నారని పోస్టుమార్టం రిపోర్ట్ లో తేలినట్టు సమాచారం. అలాగే మాల్ సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఆ ప్రమాదం సైతం డ్రగ్సు, గంజాయితోనే జరిగినట్లు ఆనవాళ్లు కనిపించినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారు ప్రమాద మృతులు నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన వారు కావడం గమనార్హం.
యదేచ్చగా హోల్సేల్ లో ఎమ్మార్పీ కంటే అదనంగా అమ్మకాలు..
నిబంధనలకు విరుద్ధంగా వైన్స్ నిర్వాహకులు హోల్సేల్ గా మద్యం అమ్మకాలు చేస్తున్న వైన్స్ యజమానులు నిమ్మకు నేరెత్తినట్లుగా ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హోల్సేల్ షాపుల్లో కేవలం బెల్టు షాప్ లో వారికే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. కేఎఫ్ లైట్ బీరు ఐబీ ఓసి బ్లెండర్స్ ప్రైడ్ రాయల్ స్టాగ్ మందులను ఈ షాపు నుండి బెల్ట్ షాపులకు ఎంఆర్పీ ధరల కంటే పదిరూపాయల నుండి 40,000 వరకు అదనంగా విక్రయిస్తున్నారు. ఆ పక్కనే ఉన్న రిటైల్ షాపులలో ఈ మధ్యాన్ని మద్యం ప్రియులకు విక్రయించారు.
దీని పై పలుమార్లు వైన్స్ నిర్వాహకుల పై మద్యం ప్రియులు ఆందోళన చేపట్టిన ఎక్సైజ్ అధికారులు ఆ షాపుల వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. చట్ట విరుద్ధంగా కల్తీ మద్యం గంజాయి విచ్చలవిడిగా జరుగుతున్న మామూళ్ల మత్తులో నిఘావ్యవస్థ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సామాన్యుల కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి వీధిన పడుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. యువత మత్తులో 24 గంటలు ఉండి తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సమాజంలో అసాంఘిక కార్యక్రమాలకు తెరలేపుతున్న వ్యక్తుల పై నిఘావ్యవస్థ గట్టి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
బెల్టు షాపుల్లోనే ఆ మద్యం లభ్యం..
మండల కేంద్రంలో ఉన్న వైన్ షాపుల్లో లభ్యం కానీ మందులు బెల్టు షాపుల్లో లభ్యం కావడం మందుబాబులకు ఆగ్రహం తెప్పిస్తుంది. బెల్టు షాపులు 24 గంటలు తెరిచి ఉండడంతో వైన్స్ యజమానులు కొన్ని బ్రాండ్లకు సంబంధించిన వైన్ రిటైల్లో అమ్మకుండా బెల్ట్ షాపుల కు అమ్ముతూ వైన్స్ నిర్వాహకులు రోజువారీగా లక్షల్లో అక్రమార్చనకు పాల్పడుతున్నారు.