- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతా.... మీ ఇష్టమేనా....?
దిశ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా శ్రీ చైతన్య స్కూల్‌లోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు గురువారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. అక్కడ విద్యార్థులకు ఏర్పాటు చేసిన మౌలిక వసతులపై ఆరా తీశారు. మూడవ అంతస్తులు పెట్టిన పరీక్షా కేంద్రాన్ని ఆయన పరిశీలించి, ఈ అంతస్తులొ పరీక్ష కేంద్రాలను పెట్టడం ఏంటి...?, అంతా మీ ఇష్టమేనా...?, ఇలా ఉంటే విద్యార్థులు అసౌకర్యానికి గురికారా...? అని కేంద్ర అదికారుల పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు పరీక్ష రాయడానికి మూడంతస్తుల ఎక్కి రావడం వలన విద్యార్థులు అలసట పాలవుతారని ఇలాంటి పొరపాట్లు మరల చేయవద్దని ఇన్చార్జి డీఈఓ శైలజను ఆదేశించారు. ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి పరీక్ష కేంద్రానికి పంపాలని,సెల్ ఫోన్లు ఎవరు తీసుకొని రావద్దని కలెక్టర్ సూచించారు. గురువారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు 179 మందికి గాను 179 మంది హాజరయ్యారని చీఫ్ సూపర్డెంట్ తబిత కలెక్టర్‌కి తెలిపారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట ఇంచార్జి ఎంఈఓ శైలజ, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.