ప్రజావాణికి హాజరుకాని అధికారులపై చర్యలు: కలెక్టర్ ఎస్ వెంకట్రావు

by Kalyani |   ( Updated:2023-02-13 13:37:56.0  )
ప్రజావాణికి హాజరుకాని అధికారులపై చర్యలు: కలెక్టర్ ఎస్ వెంకట్రావు
X

దిశ, సూర్యాపేట కలెక్టరేట్: ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకాని జిల్లా అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలని, హాజరు కాని వారిపై తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి విన్నపాలను స్వీకరించిన కలెక్టర్ ఆన్ లైన్ లో కూడా మండల అధికారులతో మాట్లాడి వారి సమస్యలను వెంటనే పరిష్కరించారు.

ప్రజావాణిలో మఠంపల్లి మండలం, బక్కమంతులగూడెం గ్రామానికి చెందిన గుండ్లపల్లి పద్మ తమ వ్యవసాయ భూమి పాసుపుస్తకంలో నమోదు కాలేదని కలెక్టర్ కు తెలపగా వెంటనే కలెక్టర్ ఆన్ లైన్ ద్వారా మఠంపల్లి తహసీల్దార్ సాయగౌడతో మాట్లాడి సర్వే చేసి వీరి భూమిని పుస్తకంలో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్, రెవెన్యూ జిల్లా అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు, డీఆర్వో రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story