సిట్టింగులకు ఎంపీ సీట్లు కన్ఫర్మ్.. అధ్యక్షుడు కిషన్ రెడ్డి షాకింగ్ రియాక్షన్

by GSrikanth |
సిట్టింగులకు ఎంపీ సీట్లు కన్ఫర్మ్.. అధ్యక్షుడు కిషన్ రెడ్డి షాకింగ్ రియాక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ సీఎం కేసీఆర్ చేసిన అతిపెద్ద స్కాం అని, కాళేశ్వరం అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే కాళేశ్వరం అవినీతిపై 48 గంటల్లో కేంద్రం సీబీఐతో విచారణ జరిగేలా రికమండ్ చేస్తామని వెల్లడించారు. ఇవాళ బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు చేయవద్దనే చట్టాన్ని బీఆర్‌ఎస్ తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ అయినా ఆ చట్టాన్ని తీసివేసి దర్యాప్తు చేస్తుందా? లేక బీఆర్ఎస్‌ను కాపాడుతుందా? అని నిలదీశారు. కాంగ్రెస్ సీబీఐ దర్యాప్తు కోరకుంటే ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో చర్చిస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంపై మంత్రులు వెళ్లారని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకున్నారని, కానీ వారికి ఏం చేయాలో కనీస అవగాహన లేకుండా పోయినట్లు తెలుస్తోందని విమర్శించారు. అసలు కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ ఏం చేయబోతోందని ప్రశ్నించారు.

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో స్టేట్ ఎలక్షన్ టీమ్ సమావేశం జరగనుందని కిషన్ రెడ్డి ఇవాళ మీడియాతో చిట్‌చాట్‌‌లో తెలిపారు. ఈ సమావేశాలకు జాతీయ స్థాయి నేతలు వస్తున్నారని చెప్పారు. నలుగురు సిట్టింగులకు ఎంపీ సీట్లు కన్ఫర్మ్ అని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. దానికి సంబంధించిన ఎలాంటి చర్చ అసలు జరగలేదని స్పష్టం చేశారు. ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగకు టికెట్ అంటూ బేస్ లెస్ న్యూస్ వస్తోందని, ఆ ప్రచారం కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షుల మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తమ ఫోకస్ మొత్తం లోక్ సభ ఎన్నికలపైనే ఉందని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కూడా బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తామని వెల్లడించారు. ఎంపీ అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తామని అన్నారు. 50 శాతం లోక్ సభ స్థానాలకు అభ్యర్థులు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారని తెలిపారు. ఫిబ్రవరి 28 లేదా మార్చి మొదటి వారంలో పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండబోదని స్పష్టంచేశారు.

కేసీఆర్ కు అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానించారో లేదో తెలియదన్నారు. ఫామ్ హౌజ్‌లో కేసీఆర్.. ప్రగతి భవన్ లో కాంగ్రెస్ ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఒప్పందం జరిగిందని ఆరోపించారు. మీరు మాజోలికి రావద్దు.. మేము మీ జోలికి రాబోమని ఒప్పందం కుదిరింది.. అని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed