BJP స్టేట్ చీఫ్‌గా బండిని తొలగించడానికి కారణం అదే.. సీక్రెట్ రివీల్ చేసిన MP అర్వింద్

by Satheesh |   ( Updated:2024-03-03 14:44:08.0  )
BJP స్టేట్ చీఫ్‌గా బండిని తొలగించడానికి కారణం అదే.. సీక్రెట్ రివీల్ చేసిన MP అర్వింద్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీ బండి సంజయ్‌ను తొలగించడంపై ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఎంపీ అర్వింద్ ఓ టీవీ ఛానెల్ డిబేట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ పదవి కాలం అయిపోయినందు వల్లే ఆయన్ని అధిష్టానం మార్చిందని క్లారిటీ ఇచ్చారు. బండి సంజయ్‌పై తాను అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు వచ్చిన వార్తలను ఈ సందర్భంగా అర్వింద్ ఖండించారు.

సంజయ్‌పై హై కమాండ్‌కు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు వార్తలపైన అర్వింద్ క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్‌తో మా అధిష్టానం పొత్తు పెట్టుకుంటుందని అనుకోవడం లేదని అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కలవబోమని నిజామాబాద్ జిల్లా పర్యటనలో ప్రధాని మోడీ చెప్పారని గుర్తు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందం కుదిరిందన్న ప్రచారంలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed