ముందస్తుకు వెళ్తే కేటీఆర్ ఓడిపోవడం ఖాయం: MP

by GSrikanth |   ( Updated:2023-01-30 11:50:18.0  )
ముందస్తుకు వెళ్తే కేటీఆర్ ఓడిపోవడం ఖాయం: MP
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముందస్తుకు వెళ్తే సిరిసిల్లలో కేటీఆర్ కూడా ఓడిపోతారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. రెండు రోజుల క్రితం నిజామాబాద్ పర్యటనలో మంత్రి కేటీఆర్ 'దమ్ముంటే లోక్‌సభను రద్దు చేసి రండి. ముందస్తు ఎన్నికలకు అందరం కలిసే పోదాం' అంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై సోమవారం అర్వింద్ రియాక్ట్ అయ్యారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లలో కేటీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు. నిజామాబాద్‌కు వచ్చిన కేటీఆర్‌కు నిజాం షుగర్ ఫ్యాక్టరీ గుర్తుకురాలేదు కానీ తిలక్ గార్డెన్ గుర్తుకు వచ్చిందన్నారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, 100 రోజుల్లో చెరుకు ఫ్యాక్టరీ తెరిపిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఖాళీ స్థలాల్లో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామన్న హామీ గాలికి వదిలేశారని, బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీలు తప్ప, ఆచరణలో చేసింది శూన్యం అని ధ్వజమెత్తారు. దొర తనాన్ని తరిమి కొడతానమి హెచ్చరించారు. తన తండ్రి పెద్దమనిషిలాంటోడని అదే కేసీఆర్ బ్రోకర్ అని యావత్ తెలంగాణ సమాజానికి తెలుసని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నిజామాబాద్‌కు కేసీఆర్, కేటీఆర్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్లు తిన్నారు కాబట్టే డీపీఆర్ ఇవ్వమంటే ఇవ్వడం లేదని ఆరోపించారు. మీరు డీపీఆర్ ఇస్తే జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు. మహిళా గవర్నర్‌పై అసభ్య పదజాలంతో నేతలు దూషిస్తున్నారని, ఇదేలా BRS సంస్కృతి అని నిలదీశారు. రాష్ట్రం వచ్చాక కల్వకుంట్ల కుటుంబ సభ్యులే బాగుపడ్డారని సామాన్య ప్రజల జీవితం దిగజారిపోయిందన్నారు. చేనేత జీఎస్టీలో రాష్ట్ర వాటా కట్ చేసి ఆ తరువాత జీఎస్టీ గురించి కేటీఆర్ మాట్లాడాలని సూచించారు. అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణలోనే పెట్రోల్, డీజిల్ రేటు ఎక్కువగా ఉన్నాయని మండిపడ్డారు. కేటీఆర్ నిజామాబాద్‌కు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. పసుపు బోర్డు కంటే మెరుగైన బోర్డు తెచ్చామని ఈ ప్రభుత్వానికి విద్య, వైద్యంపై ఏమైన అలోచన ఉందా అని ప్రశ్నించారు.

Advertisement

Next Story