MP Chamala Kiran: హరీశ్‌రావు, పాడి కౌశిక్ అరెస్ట్‌లపై ఎంపీ చామల కిరణ్ రియాక్షన్ ఇదే

by Ramesh N |
MP Chamala Kiran: హరీశ్‌రావు, పాడి కౌశిక్ అరెస్ట్‌లపై ఎంపీ చామల కిరణ్ రియాక్షన్ ఇదే
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, పాడికౌషిక్ రెడ్డి అరెస్టులపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) స్పందించారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు హరీశ్‌రావు (Harish Rao), పాడి కౌశిక్‌రెడ్డి (Kaushik Reddy) వాళ్ళు అందరూ కూడా నాటకానికి పూనుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జిల్లాల్లో పర్యటిస్తూ.. ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఇవన్నీ చూసి ఓర్వలేక (BRS) బీఆర్ఎస్ నాయకులు మీడియా అటెన్షన్‌ని తమ వైపు తిప్పుకోవాలన్న దురుద్దేశ్యంతో ఈ వీధి నాటకాలకు తెరతీశారు.. అని విమర్శించారు. వారంతట వారే పోలీస్ స్టేషన్లలో కేసులు పెడుతున్నారని, పోలీసులను దూషిస్తున్నారని ఆరోపించారు.

హరీశ్‌రావు లాంటి వారు అరెస్టులను ఆపే ప్రయత్నంలో భాగంగా కౌశిక్‌రెడ్డి ఇంటికి పోయి హంగామా సృష్టించారని విమర్శించారు. దీంతో రాష్ట్రంలో మీడియా అంతా కూడా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చూపించకుండా పక్కదోవ పట్టించి వీలు చేసే వీధి నాటకాలు చూపాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని తెలిపారు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలని, పదేళ్లలో జరగని కార్యక్రమాలు కాంగ్రెస్ ఒక ఏడాది పాలనలో జరుగుతున్నాయని, చిల్లర నాటకాలకు తెరలేపారని మండిపడ్డారు.

Next Story

Most Viewed