MP Chamala Kiran Kumar Reddy : కిషన్ రెడ్డిపై ఎంపీ చామల ఫైర్

by Y. Venkata Narasimha Reddy |
MP Chamala Kiran Kumar Reddy : కిషన్ రెడ్డిపై ఎంపీ చామల ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : దావోస్ పెట్టుబడు(Davos Investments)ల సమీకరణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వా(CM Revanth Reddy Government)న్ని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి(Kishan Reddy) విమర్శించడం(Criticizing)పై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy)మండిపడ్డారు. గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కిషన్ రెడ్డి గులాబీ కళ్ళజోడు తీసేసి చూస్తే అన్ని సజావుగానే కనిపిస్తాయని చురకలేశారు.

కిషన్ రెడ్డి మోడీ క్యాబినెట్లో మంత్రినా లేక.. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పాలేరువా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలలో చేయలేని అభివృద్ధిని రేవంత్ రెడ్డి మొదటి సంవత్సరంలోనే అభివృద్ధి చేసి చూపిస్తుంటే, వాళ్లు 9 సంవత్సరాలలో తేలేని పెట్టుబడులను తెచ్చి తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పన చేస్తుంటే చూసి ఓర్వలేక కడుపు మంటతో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే నిన్న వాళ్లకు ఈనో ప్యాకెట్స్ తాగమని చెప్పామని గుర్తు చేశారు. దానికి తోడు కిషన్ రెడ్డి కూడా కేసీఆర్ కాలికి ముల్లుకుచ్చుకుంటే ఆయన నోటితో తీస్తా అనే విధంగా మాట్లాడుతున్నాడని చామల మండిపడ్డారు. కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అభివృద్ధికి భిన్నంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.

దావోస్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రూ. 1,78,950 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారని..దానికి శుభం పలకరా పెళ్ళికొడుకా అంటే పెళ్లికూతురు ముండ మోసిందట అనే సామెత మాదిరిగా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడని చామల దుయ్యబట్టారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు స్క్రిప్టులు షేర్ చేసుకొని మరీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయన్నారు. తెలంగాణ బిడ్డలకు ఉపాధి కల్పన కోసం దావుస్ వెళ్లి పెట్టుబడులు తెస్తుంటే ప్రెస్ మీట్ లు పెట్టి ప్రతిపక్షాలు అబద్ధాలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మరి తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుంటే మంచి అనే ఒప్పుకోవాల్సిన అవసరం ఉందని.. దుష్ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దన్నారు. కిషన్ రెడ్డి కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ బాటలోనే వెలుతున్నారన్నారు.

బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ రియల్టర్ పై దాడి విషయంపై బీఆర్ఎస్ ఎందుకు స్పందిస్తలేదని..ఈటెల విషయాన్ని మీరు ఏకీభవిస్తున్నారా అని ప్రశ్నించారు. ఒక్క తెలంగాణ నుంచే దావోస్ వెళ్లలేదని దేశంలోని చాల రాష్ట్రాల ప్రభుత్వాలు వెళ్లాయని. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల నుండి కూడా ముఖ్యమంత్రులు మంత్రులు వెళ్లారని..మరి వారిని కూడా కిషన్ రెడ్డి పెట్టుబడులపై సవాల్ చేస్తారా అని చామల నిలదీశారు. మీరు దేశానికి మంత్రి అని.. రాష్ట్రం గురించి విమర్ళలు చేయడం సరికాదన్నారు. అబద్ధాలు మాట్లాడడం మానేసి రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరించాలని కోరారు.



Next Story

Most Viewed