- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
MP Chamala : బీజేపీ గుజరాత్ అధ్యక్షుడిపై ఎంపీ చామల ఫిర్యాదు

దిశ, వెబ్ డెస్క్ : రాహుల్ ఫోటో మార్ఫింగ్ వివాదంలో బీజేపీ గుజరాత్ అధ్యక్షుడు(BJP Gujarat president) చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్(Chandrakant Raghunath Patil)పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy), ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగా రెడ్డి(Mal Reddy Ranga Reddy)లు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు(Police Complaint)చేశారు. బీజేపీ గుజరాత్ ఎక్స్ ఖాతాలో మార్ఫింగ్ ఇమేజ్ పోస్టు చేసి రాహుల్ గాంధీ నల్లధనం కలిగి ఉన్నారంటూ దుష్ర్పచారం చేశారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. భారత న్యాయ సంహిత, ఐటీ చట్టాల్లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
కాగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిలు పోలీస్ స్టేషన్ కు వచ్చిన సందర్భంలో ఆ మార్గంలో పోలీసులు వాహనాలను ఆపడంతో ఓ అంబులెన్స్ ట్రాఫిక్ జాంలో ఇరుక్కోవడం విమర్శలకు దారితీసింది. పోలీస్ స్టేషన్ ముందు విజయవాడ జాతీయ రహదారి నడిరోడ్డుపై చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి వాహనాలను నిలపడంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది.