- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నయా నిజాం ‘కాసిం చంద్రశేఖర్ రిజ్వీ’: కేసీఆర్‌పై బండి సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: దేవాలయాలను, దేవుళ్లను బీఆర్ఎస్ సర్కార్ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇటీవల ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ తెలంగాణ ప్రభుత్వం కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్న ఆలయాలకు పది కోట్లు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాల్లోని సొమ్మును కామారెడ్డి ఆలయాలకు మళ్లిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నిజాం, రజాకార్లు దేవాలయాలను దోచుకున్నట్లుగా, నయా నిజాం కాసీం చంద్రశేఖర్ రిజ్వీ ఇప్పుడు కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని, కాబట్టి ఇతర నియోజకవర్గాల నుంచి ఆలయ సొమ్మును కామారెడ్డికి మళ్లించాలని కోరుతున్నారని వెల్లడించారు. మరోవైపు ఈ వ్యక్తులు సిగ్గులేకుండా తమని కమ్యూనల్ అంటారని విమర్శించారు.
కామారెడ్డి ఓటర్లు జాగ్రత్త ఉండాలని, సీఎం కేసీఆర్ ఆలయ పునరుద్ధరణపై తప్పుడు వాగ్దానాలు మాత్రమే చేస్తారని, ట్రాప్‌లో పడొద్దని సూచించారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం, వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం, అలంపూర్ జోగులాంబ దేవాలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం, బాసర సరస్వతి ఆలయం, ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాల అభివృద్ధి ఏమైందని ప్రశ్నించారు.