MLC Kavitha: ‘నాగార్జునసాగర్’ ఏడాదిగా సీఆర్పీఎఫ్ ఆధీనంలోనే.. సీఎంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

by Ramesh N |
MLC Kavitha: ‘నాగార్జునసాగర్’ ఏడాదిగా సీఆర్పీఎఫ్ ఆధీనంలోనే.. సీఎంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ. 2500 ఇవ్వాల్సిందేనని తెలంగాణ జాగృతి చీఫ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) డిమాండ్ చేశారు. తన నివాసంలో వరంగల్, నిజామాబాద్ తెలంగాణ జాగృతి కమిటీలతో ఎమ్మెల్సీ కవిత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మహాలక్ష్మీ కింద రూ. 2500 ఇవ్వడంతో పాటు గత 12 నెలల కాలానికి గాను బాకీ పడ్డ రూ 30 వేలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు పెన్షన్‌ను రూ 4 వేలకు పెంచాలని, ఇప్పటి వరకు పెంచని కారణంగా బాకీ పడ్డ రూ. 24,000 వేలు కూడా చెల్లించాల్సిందే అని డిమాండ్ చేశారు.

రేవంత్ ముఖ్యమంత్రి అయ్యి ఏడాది అయినా (Nagarjuna Sagar Dam) నాగార్జునసాగర్ డ్యామ్ సీఆర్పీఎఫ్ అధీనంలోనే ఉన్నదని, ప్రాజెక్టును ఇప్పటికీ తెలంగాణ అధీనంలోకి తేలేదని మండిపడ్డారు. తెలంగాణ నీళ్ల మీద సీఎం రేవంత్ రెడ్డి ఆయన గురువుని ఎందుకు ప్రశ్నించడం లేదని కవిత నిలదీశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేయొద్దని గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చినా పనులు కొనసాగుతున్నాయని అన్నారు. (CM Revanth Reddy) రేవంత్ సీఎం అయిన తర్వాత ఆరు నెలల పాటు ఒక్క ప్రాజెక్టులో స్పూన్ మట్టి కూడా తీయలేదని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed