కర్రిగుట్టల్లో మోస్ట్ వాంటెడ్ ‘హిడ్మా’ దళం! జల్లెడ పడుతోన్న సాయుధ బలగాలు

by Shiva |   ( Updated:2025-04-22 05:30:59.0  )
కర్రిగుట్టల్లో మోస్ట్ వాంటెడ్ ‘హిడ్మా’ దళం! జల్లెడ పడుతోన్న సాయుధ బలగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్ట్ ఆపరేషన్స్‌ (Maoist Operations)లో కీ మెంబర్, దండకారణ్యంలో ధీటైన దండయాత్రలు చేయడంలో దిట్ట, మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్‌ హిడ్మా (Hidma)పై సాయిధ బలగాలు ఫోకస్ పెట్టాయి. ఒకనొక దశలో తనదైన మిలటరీ ఆపరేషన్స్‌తో భద్రతా దళాల గుండెల్లో బాంబుల మోత మోగించిన హిడ్మా ఇప్పుడు ఎక్కడున్నాడు.. ఏమైపోయాడనే వార్తలు వినిపిస్తున్నారు. కవ్వింపు చర్యలకు పాల్పడి.. కూబింగ్ నిర్వహిస్తోన్న భద్రతా దళాలను హతమార్చడంలో హిడ్మా ఎక్స్‌పర్ట్. 2010లో కేంద్ర బలగాలు ప్రయాణిస్తున్న మైన్ ప్రూఫ్ వాహనాన్ని పేల్చి 76 మందిని హత‌మార్చిన ఘటనతో హిడ్మా వెలుగులోకి వచ్చాడు. అదేవిధంగా సరిగ్గా నాలుగేళ్ల క్రితం సొంత గ్రామం పువ్వర్తి (Puvvarthi), జీనుగూడ (Jinuguda) కీకారణ్యంలో కూంబింగ్ (Combing) చేపట్టిన బలగాలను రౌండప్ చేసి 26 మంది మట్టుబెట్టిన ఆ సన్నివేశాలు భద్రతా బలగాల కళ్ల ముందే ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. ఇటీవల ఎదరుకాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు ఒడిశా ఇంచార్జ్ రామచంద్రా రెడ్డి అలియాస్.. చలపతి (Chalapathy) మృతితో మళ్లీ హిడ్మా పేరు తెరపైకి వచ్చింది.

వెయ్యి మందితో కూంబింగ్

ప్రస్తుతం కేంద్ర మిలటరీ కమిషన్ ఇంచార్జ్‌గా ఉన్న హిడ్మా (Hidma)కు సెంట్రల్ కమిటీలో ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదని తెలుస్తోంది. చలపతికి రక్షణ కల్పించే విషయంలో హిడ్మా ఫెయిల్ అయ్యారని.. అందుకే ఆయనను కేంద్ర మిలటరీ కమిషన్ ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, అతడి స్థానంలో దేవ్‌ అనే మరో కీలక మావోయిస్టు నేతకు ఆ బాధ్యతలు అప్పగించారని టాక్. ఈ క్రమంలోనే హిడ్మా దళం ములుగు జిల్లా కర్రిగుట్టల్లో సంచరిస్తున్నట్లుగా కేంద్ర సాయుధ బలగాలకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన వారు కర్రిగుట్ట పరిసర ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచే కూంబింగ్ ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే వెంకటాపురం మండల పరిధిలో ఉన్నతాధికారులు భారీగా సాయుధ బలగాలను మోహరించారు. ప్రస్తుతం వెంకటాపురం అటవీ ప్రాంతాన్న వెయ్యి మంది సాయుధ బలగాలు జల్లె పడుతుండా.. అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది.


Next Story

Most Viewed