- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BJP అసలు టార్గెట్ నేను కాదు.. MLC కవిత షాకింగ్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఆ కేసుకు సంబంధించి కీలక అంశాలు వెల్లడించారు. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేదే లేదన్న కవిత ఈ కేసులో తన పాత్ర లేదన్నారు. ఈ కేసుకు నేను భయపడబోనని ఒకవేళ అని అరెస్ట్ చేస్తే ప్రజల ప్రజాకోర్టులో తేల్చుకుంటాన్నారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కవిత ఈ కేసుకు సంచలన పలు అంశాలు పంచుకున్నారు. ఈ కేసులో విచారణకు సహకరిస్తానన్న కవిత ఈ స్కామ్ విషయంలో బీజేపీ నేతలు తలో మాట చెబుతున్నారన్నారు. రూ.130 కోట్ల అవినీతి నాకు తెలియదన్నారు.
ప్రజల ఆలోచనలను మభ్యపెట్టేందుకే లిక్కర్ కేసును తెరపైకి తీసుకువస్తున్నారని అన్నారు. తాను ఎలాంటి ఫోన్లు ధ్వంసం చేయలేదని తన ఫోన్లు తన వద్దే ఉన్నాయని సీబీఐ అడిగితే వారికి ఇస్తాన్నారు. సీబీఐ కోరిన బ్యాంక్ స్టేట్ మెంట్స్ ఇప్పటికే దర్యాప్తు అధికారులకు అప్పగించాన్నారు. తనకు ఆడిటర్‌గా పని చేసిన బుచ్చిబాబును అరెస్ట్ చేయడం వల్ల బీజేపీకే నష్టం అన్నారు. చట్టపరంగా న్యాయపరంగా ఎలాంటి దర్యాప్తునైనా చేయనీయండి. తాము లీగర్ పోరాటం చేస్తాం అని చెప్పారు. బీజేపీకి అసలు టార్గెట్ తాను కాదని కేసీఆర్ అన్నారు. త్వరలో కవిత తిహార్ జైలుకు వెళ్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారని ఏజెన్సీ సంస్థలు ఏం చేయాలో బీజేపీ నేతలే చెబుతారా అని ప్రశ్నించారు.
జైలుకు వెళ్లేందుకు కవిత మానసికంగా సిద్ధం అయ్యారా అని ప్రశ్నించగా తాను కేసీఆర్ బిడ్డను అని ప్రజలకు బీజేపీ వైఫల్యాలను తప్పక వివరిస్తామన్నారు. ఈ కేసులో కేసీఆర్ ఏదైనా అడ్వైజ్ చేస్తున్నారనే ప్రశ్నకు బీఆర్ఎస్‌లో అందరి మాదిరిగానే తనకు న్యాయ సలహాలు అందుతున్నాయన్నారు. నిజామాబాద్ ఎంపీగా పోటీ అనేది పార్టీ నిర్ణయమని చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తు అనేది అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుందన్నారు. కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి ఉందని చెప్పారు. మోడీ ముక్త్, బీజేపీ ముక్త్ భారత్ రావాలన్నారు. మోడీకి ప్రత్యామ్నాయం ఈ దేశంలో వంద మంది ఉన్నారని అన్నారు.