- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బ్రేకింగ్: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెరపైకి మళ్లీ కవిత పేరు
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి వచ్చింది. ఈ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేర్కొంది. ఈ కేసులో నిందితుడు అయిన అరుణ్ రామచంద్ర పిళ్లై బెయిల్ పిటిషన్‌పై మంగళవారం రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన వాదనల్లో ఈడీ తరుపు లాయర్లు ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించారు. ఢిల్లీ మద్యం పాలసీలో స్కామ్ జరిగిందని ఈడీ తరుఫు లాయర్లు కోర్టుకు తెలిపారు.
ఈ స్కామ్‌కు సంబంధించి జరిగిన మీటింగుల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బులతో కవిత ఫీనిక్స్ అనే కంపెనీ నుండి భూములు కొన్నారని ఈడీ లాయర్లు తెలిపారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరుణ్ రామచంద్ర పిళ్లైది కీలక పాత్ర అని.. అతడికి బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరుఫు లాయర్లు కోర్టును కోరారు. ఇక ఈ పిటిషన్‌పై తమ వాదనలు వినిపించేందుకు మరింత సమయం కావాలని పిళ్లై తరుఫు లాయర్లు న్యాయస్థానాన్ని కోరారు. దీంతో పిళ్లై బెయిల్ పిటిషన్ తదుపరి విచారణను స్పెషల్ కోర్టు జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది.
అయితే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ ఇటీవల దాఖలు చేసిన రెండవ చార్జ్ షీట్ ఎమ్మెల్సీ కవిత పేరు ఎక్కడ లేకపోవడంతో ఇక ఈ కేసు నుండి కవితకు లైన్ క్లియర్ అయ్యిందని ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగానే, ఈ స్కామ్‌లో ఈడీ మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. .
Also Read..
దూకుడు పెంచిన సీబీఐ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో వ్యక్తి అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. MLC కవితపై సంచలన అభియోగాలు మోపిన ఈడీ!
సిసోడియాకు బెయిల్ నిరాకరణ.. ఆయనపై ఆరోపణలు తీవ్రమైనవి : ఢిల్లీ హైకోర్టు