బిగ్ బ్రేకింగ్: జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన కవిత దీక్ష.. 18 పార్టీల నేతలు హాజరు!

by Satheesh |   ( Updated:2023-03-10 05:12:19.0  )
బిగ్ బ్రేకింగ్: జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన కవిత దీక్ష.. 18 పార్టీల నేతలు హాజరు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష ప్రారంభమైంది. మహిళ రిజర్వేషన్ల బిల్లు కోసం భారత జాగృతి ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన దీక్ష ప్రాంతానికి కాసేపటి క్రితమే కవిత చేరుకున్నారు. కాగా, కవిత దీక్షకు 18 పార్టీలు సంఘీభావం తెలపడంతో పాటు.. ఆయా పార్టీలకు చెందిన నేతలు ఆమె దీక్షకు హాజరయ్యారు. బీఆర్ఎస్ నుండి అధికారికంగా మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కవిత దీక్షకు హాజరయ్యారు.

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా కవిత దీక్షలో పాల్గొన్నారు. కాగా, మహిళ రిజర్వేషన్ల కోసం ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన ఈ దీక్ష ఇవాళ సాయంత్రం నాలుగు గంటల వరకు సాగనుంది. ఇదిలా ఉండగా.. కవిత దీక్ష కౌంటర్‌గా ఢిల్లీ బీజేపీ యూనిట్ ధర్నా చేపట్టింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితులను అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం చేపట్టింది. బీజేపీ, బీఆర్ఎస్‌ల పోటాపోటీ కార్యక్రమాలతో రాజధానిలో పొలిటికల్ హీటెక్కింది.

Advertisement

Next Story