MLA Seethakka: ఆ పదవులు మాకొద్దు: రాజీనామాపై ఎమ్మెల్యే సీతక్క కార్లిటీ

by Satheesh |   ( Updated:2022-12-18 15:06:55.0  )
MLA Seethakka: ఆ పదవులు మాకొద్దు: రాజీనామాపై ఎమ్మెల్యే సీతక్క కార్లిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభం డ్రామా క్లైమాక్స్‌కు చేరుకుంది. పీసీసీ కమిటీల్లో టీడీపీ నుండి వచ్చిన వారికే పదవులు కట్టబెట్టారని ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో సీనియర్లు చేసిన ఆరోపణలకు టీడీపీ నుండి వచ్చిన నేతలు రాజీనామాలతో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏకంగా 12 మంది పార్టీ పదవులకు రాజీనామా చేస్తూ.. లేఖను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్‌కు పంపారు. దీంతో తెలంగాణ రెండు వర్గాలుగా చీలిపోయింది.

తాజాగా పీసీసీ పదవులకు రాజీనామా చేసిన 12 మందిలో ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో మా పదవులే కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు సమస్యగా మారిందన్నారు. సీనియర్లకు మా పదవులే అడ్డంకి అయితే ఆ పదవులు మాకొద్దని కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే పీసీసీ పదవులకు రాజీనామా చేశామని తెలిపారు. తాము కాంగ్రెస్ పార్టీ తరుఫున ఆరేళ్లుగా సీఎం కేసీఆర్‌కి వ్యతిరేకంగా పోరాడుతున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

READ MORE

Revanth Reddy: రేవంత్ రెడ్డికి జై కొట్టిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు

Next Story

Most Viewed