- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ కేడర్ మొత్తం వచ్చిన.. దుబ్బాకలో గెలిచేది నేనే: ఎమ్మెల్యే రఘునందన్ రావు
దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి చైనా దేశానికి చెందిన వ్యక్తికి మధ్య సంబంధం ఏంటని, చైనాకు చెందిన ‘మో’ అనే వ్యక్తితో తరచూ నిరంజన్ రెడ్డి ఫోన్లో మాట్లాడుకున్నారని, ఇరువురికి మధ్య సంబంధం ఏంటని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తాను గతంలో చేసిన ఆరోపణలపై మంత్రి సింగిరెడ్డి మాట్లాడారని, అయితే సర్వే నంబర్ 60 అంశం మినహా.. ఇతర అంశాలపై ఆయన ఎందుకు నోరు మెదపలేదో సమాధానం చెప్పాలని రఘునందన్ రావు ప్రశ్నించారు. తాను అడిగిన ఏ ప్రశ్నకూ సూటిగా సమాధానం చెప్పలేదని విమర్శలు చేశారు. తిమ్మిని బమ్మి. మసి పూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. ఇలాంటి ఎపిసోడ్లు మరిన్ని జరగాలని మంత్రి కోరుకుంటున్నట్లున్నారని దుబ్బాక ఎమ్మెల్యే ఎద్దేవాచేశారు. మంత్రికి ఉన్న దత్త పుత్రులు ఎంతమంది అనే వివరాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వారిని ఏయే పనులకు వాడుకుంటున్నారనేదీ వివరించాలన్నారు.
కొవిడ్ సమయంలో రిజిస్ట్రేషన్‌కు అమెరికా నుంచి రాలేకపోవడం వల్ల దత్త పుత్రుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్లు మంత్రి తెలిపారని, అయితే సేల్ డీడ్‌లో ఉన్నది ఎన్ని ఎకరాలో బయటపెట్టాలన్నారు. డబ్బు వైట్ రూపంలో చెల్లించారా? బ్లాక్ రూపంలో చెల్లించారా? అనేది కూడా చెప్పాలన్నారు. ఎందుకంటే ఇవన్నీ పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన ట్రాన్సాక్షన్స్ అని ఆయన గుర్తుచేశారు. దీనికి సంబంధించిన ఇన్ కం టాక్స్ చెల్లించారా? లేదా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు.
మంత్రి తన దత్త పుత్రుడిని బినామీగా వాడుకుంటున్నారనే అనుమానాన్ని ఆయన వ్యక్తంచేశారు. దత్త పుత్రుడే అయితే ఆయన పేరిట భూమి ఉంటే ఏంటి? మంత్రి కూతురి పేరిట ఉంటే ఏంటని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గౌడ నాయక్ పేరిట ఎస్టీ కార్పొరేషన్ లోన్, సబ్సిడీలు, హిటాచీలు, జేసీబీలు ఏమైనా కొనుగోలు చేశారా? అని రఘునందన్ ప్రశ్నించారు. కాంట్రాక్ట్ దత్త పుత్రుడికి, అగ్రికల్చర్ వీసీగా వియ్యంకుడికి అందించారని మంత్రిపై విమర్శలు గుప్పించారు. నిరంజన్ రెడ్డిపై తనకు వ్యక్తిగత ద్వేషం లేదన్నారు.
గ్రౌండ్ నట్(వేరుశనగ) రీసెర్చ్ సెంటర్ కోసం రూ.40 లక్షలు ఖర్చు పెట్టాలని ప్రొసీడింగ్స్ ను మంత్రి తెచ్చారని, అయితే దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరూ మంజూరు చేయలేదన్నారు. సంబంధిత గ్రామపంచాయతీలో సర్పంచ్ తో రూ.5 లక్షల చొప్పున మంత్రి దత్త పుత్రుడి పేరిట పనులు చేసినట్లు తీర్మానాలు చేయించుకున్నారని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు.
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఉన్నపళంగా ఫోన్ ఎందుకు మార్చుకున్నారని, ఆ ఫోన్ ఎటు పోయిందని, ఫోన్ మార్చడం వెనుక ఉన్న మంచి, చెడు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని అంశాలపై తాను రాతపూర్వకంగా ఈడీకీ, ఇన్ కం ట్యాక్స్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టంచేశారు. మంత్రి వద్ద ఉన్న పాత నంబర్ నుంచి చైనాకు చెందిన ‘మో’ అనే వ్యక్తికి రెగ్యులర్ గా కాల్స్ వెళ్లాయని, ‘మో’ కూడా అమెరికాలో పలువురితో చర్చలు జరిపారని, మంత్రి అతడితో అన్నిసార్లు ఏం మాట్లాడారు? ఆయన అన్నిసార్లు ఇండియాకు ఎందుకు వచ్చారు? దీని వెనక ఏం జరుగుతోందనేది బయటకు తీస్తానన్నారు.
మంత్రి తప్పు చేయకుంటే ఆయన ప్రాపర్టీస్ అన్నీ పబ్లిక్ డొమెయిన్ లో పెట్టాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. భవిష్యత్ లో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కేడర్ మొత్తం వచ్చి దుబ్బాకలో తిష్టవేసినా గెలిచేది తానేననే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మంత్రి 3 నుంచి 4 కిలోమీటర్ల మేర తాను, రైతులు కలిసి రోడ్డు వేయించినట్లు చెప్పారని, దానికి రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల ఖర్చవుతుందని, రైతులు అంత ఖర్చు పెట్టగలరా? అని ఆయన ప్రశ్నించారు. ఇదిలాఉండగా మంత్రి తన భార్య కష్టార్జితంతో రూ.4 కోట్లు పెట్టి ఫాంహౌస్ కొన్నట్లు చెప్పారని, దాన్ని నాకు కొనగలో చేస్తానని మంచి ఆఫర్ ఇచ్చారన్నారు. ఆయన ఇస్తానంటే వైట్ మనీ ఇచ్చి కొంటానని రఘునందన్ తెలిపారు. అయితే ఆ నిర్ణయాన్ని తన సతీమణితో చర్చించి అంత మనీ ఉందా? లేదా అని అడిగి కొంటానని రఘునందన్ చెప్పారు.