తప్పు ఒప్పుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూతురు.. క్షమించాలంటూ రిక్వెస్ట్!

by GSrikanth |
తప్పు ఒప్పుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూతురు.. క్షమించాలంటూ రిక్వెస్ట్!
X

దిశ, చేర్యాల: చేర్యాల మత్తడి భూమి ఆక్రమణ విషయంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆయన కూతురు కూతురు తుల్జ భవాని రెడ్డి మధ్య కొనసాగుతున్న వాగ్వాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్లు 1399, 1400, 1401, 1402 లలో 23 గంటల భూమిని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆక్రమించుకుని కూతురు తుల్జా భవానిరెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని స్వయంగా ఎమ్మెల్యే కూతురే ఆరోపించింది. అంతేగాక, ఈ వివాదాస్పద భూమి చుట్టూ ఉన్న కాంపోడ్ వాల్‌ను ఆదివారం ఆమె కూల్చి వేశారు.


అనంతరం ఈ సందర్భంగా తుల్జ భవానిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘తప్పు జరిగింది. మత్తడి భూమిని నాపేరిట మానాన్న రిజిస్ట్రేషన్ చేయించారు. నేను కరెక్ట్ చేసుకుంటున్నాను. ఆ భూమిని చేర్యాల మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేసిస్తా. డాక్యుమెంట్ రెడీగా ఉంది. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా కోర్టు ద్వారా కలెక్టర్‌కు అప్పగిస్తా. నాన్న చేయకూడదు. కానీ చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన 70 సంవత్సరాల వ్యక్తి ఇలా చేయడం సరికాదు. ఎమ్మెల్యే కాక ముందే వెయ్యి కోట్ల ఆస్తి ఉంది. నెలకు కోటిన్నర రెంట్ వస్తుంది. అలాంటి వ్యక్తి ఇలాంటి భూమి తీసుకోకూడు. తప్పు జరిగింది. క్షమించండి తిరిగి ఇచ్చేస్తా’’ అని భవాని రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కబ్జాకు గురైన మత్తడి భూమిని తిరిగి మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేయిస్తానని ఎమ్మెల్యే కూతురు భవాని రెడ్డి ప్రకటించడంతో చేర్యాల పాత బస్టాండ్ వద్ద అఖిలపక్ష నాయకులు టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు.

Advertisement

Next Story