KCR ఎదురు దాడి చేస్తుంటే.. CM రేవంత్, భట్టి సెలైన్స్: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

by Satheesh |   ( Updated:2024-06-16 14:26:31.0  )
KCR ఎదురు దాడి చేస్తుంటే.. CM రేవంత్, భట్టి సెలైన్స్: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాజీ సీఎం, గులాబీ కేసీఆర్ లేఖ కాక రేపుతోంది. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పాంట్ల నిర్మాణానికి సంబంధించిన ఎంక్వైరీ కమిషన్‌కు కేసీఆర్ ఇచ్చిన రిప్లై లేఖ హాట్ టాపిక్‌గా మారింది. కమిషన్ విచారణను కేసీఆర్ తప్పుబట్టడంపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఫైర్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ లేఖపై బీజేపీ ఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి విచారణ చేపడుతోన్న జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్‌కు కేసీఆర్ రాసిన లేఖ అప్రజాస్వామికమని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం అపాయింట్ చేసిన పవర్ కమిషన్‌పై కేసీఆర్ ఎదురు దాడి చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించకుండా ఎందుకు సెలైంట్ ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలు బయటకు రావాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చేత విచారణ జరిపించాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed