- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మృతుల కుటుంబాలకు అండగా ఉంటా.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి భరోసా
by GSrikanth |

X
దిశ, హుజురాబాద్: బోర్నపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన టిప్పర్ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శనివారం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట బండ శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, కొలిపాక శ్రీను, గందే శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Next Story