ఢిల్లీకి మంత్రి ఉత్తమ్ రూ.100 కోట్లు పంపిండు.. MLA ఏలేటి సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2024-05-21 08:44:17.0  )
ఢిల్లీకి మంత్రి ఉత్తమ్ రూ.100 కోట్లు పంపిండు.. MLA ఏలేటి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డిపై బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా యూ- ట్యాక్స్ వసూలు చేస్తు్న్నారని ఆరోపించారు. రూ.500 కోట్లు చేతులు మారాయని సంచలన ఆరోపణలు చేశారు. అందులో రూ.100 కోట్లు మంత్రి ఉత్తమ్ ఢిల్లీకి పంపించారని అన్నారు. ఎన్నికల ఖర్చుల కోసమే రూ.100 కోట్లు ఢిల్లీకి పంపించారని వెల్లడించారు. తాను సీఎం రేసులో ఉన్నానని చెప్పడానికే మంత్రి ఉత్తమ్ డబ్బులు పంపించారని అన్నారు. సీఎం రేసులో ఎక్కడ వెనుకబడి పోతానేమో అనే భయంతో ఇలా చేశారని అన్నారు.

తోటి మిత్రులు ఇచ్చి ముందుకు వెళ్తుండటంతో భయపడి ఉత్తమ్ ఇలా చేస్తున్నారన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. దీనికి మంత్రి బాధ్యత వహిస్తారా? అధికారులు బాధ్యత వహిస్తారా? అని అడిగారు. సివిల్ సప్లయ్ కమిషనర్ చౌహాన్‌కి వ్యవసాయం గురించి తెలియదనకుంటా? అని విమర్శించారు. రైతులకు డబ్బులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్న రైస్ మిల్లర్లకు సంబంధించిన డేటా ఉందా? డిఫాల్టర్ల వివరాలు ఉన్నాయా? లేవా? అని అడిగారు. ముఖ్యమంత్రి రేవంత్ దీనిపై అఖిలపక్షం మీటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తాము ఈ తప్పులను నిరూపిస్తాం. ఇది సామాన్యుల రక్తాన్ని తాగే కుంభకోణం. స్టాక్ రైస్ మిల్లర్ల వద్ద ఉంటే ప్రభుత్వం వడ్డీ ఎందుకు కట్టాలి.. ప్రభుత్వం వడ్డీ కడుతున్నది నిజం కాదా? అని మాహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed