- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రతి ఇంటికి శుద్ధి జలాలు.. మంచినీళ్ల పండుగలో మంత్రులు
దిశ, తెలంగాణ బ్యూరో : మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ శుద్ధి చేసిన నీటిని అందజేస్తున్నామని రాష్ట్ర మంత్రలు పేర్కొన్నారు. మారుమూల తండాలు, గూడాలలో సైతం నీరు సరఫరా చేస్తున్నామన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రవీంద్ర భారతిలో వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో మంచినీళ్ల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఇంటింటికీ నీరు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమని చెప్పిన నాయకుడు కేసీఆర్ అన్నారు. జంట నగరాల ప్రజలకు త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం కృష్ణా, గోదావరి జలాలు తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వం కు దక్కుతుంది.
దేశం మొత్తం ఎంతో గొప్పగా చెప్పుకొనే విధంగా కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిందన్నారు. వేసవిలో సైతం ఎక్కడా తాగునీటి సమస్య లేదన్నారు. విజన్ ఉన్న నాయకుడు పాలకుడైతే ఏదైనా సాధ్యమేనని నిరూపించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.