Delhi: ఉత్తమ్ ఫ్యామిలీకి సోనియా బ్లెస్సింగ్స్

by srinivas |   ( Updated:2023-12-13 15:40:42.0  )
Delhi: ఉత్తమ్ ఫ్యామిలీకి సోనియా బ్లెస్సింగ్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీకి ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ ఢిల్లీకి వెళ్లిన ఉత్తమ్ దంపతులు, సోనియe, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేసినందుకు ఉత్తమ్ దంపతులకు సోనియా, రాహుల్ అభినందనలు తెలిపారు. ప్రజా పరిపాలనను సమర్ధవంతంగా అమలు చేసేందుకు టీమ్ వర్క్‌తో పని చేయాలని సోనియా సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు సీఎం, మంత్రులంతా కలసి ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. సమన్వయంతో ముందుకు వెళ్లాలని సోనియా ఆదేశించారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రజలు పవర్ ఇచ్చారన్నారు. తమ ప్రభుత్వంలో పేద ప్రజలకు అండగా నిలుస్తామన్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చేందుకు పార్టీ ప్రత్యేక ప్రణాళికలను తయారు చేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Next Story