కేసీఆర్ వచ్చినాకే.. ఏపీ జల దోపిడీ ఎక్కువ.. ఇవిగో లెక్కలు : మంత్రి ఉత్తమ్

by Ramesh N |
కేసీఆర్ వచ్చినాకే.. ఏపీ జల దోపిడీ ఎక్కువ.. ఇవిగో లెక్కలు : మంత్రి ఉత్తమ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ ఇరిగేషన్ శాఖపై అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చింది. కృష్ణ ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టారు. ఈ సందర్భం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం సాగర్ పై పోలీసులను పంపిందని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని స్పష్టం చేశారు. షరతులు అంగీకరించకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని తేల్చిచెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై గత ప్రభుత్వం శ్రద్ధ చూపించలేదని, నీటి వాటాలకు సంబంధించి రాష్ట్ర ప్రయోజానాలను కాపాడడంలో బీఆర్ఎస్ విఫలమైందని విమర్శించారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ రైతాంగానికి ప్రజానికానికి అపోహలు ఉండే విధంగా కొందరు పెద్ద మనుషులు మాట్లాడుతున్నారని విమర్శించారు.

రోజుకు 3 టీఎంసీ అక్రమంగా తరలింపు

దేశంలో గంగా నది, గోదావరి తర్వాత కృష్ణ నది పెద్దదని వివరించారు. ఈ నది తెలంగాణలో నారాయణ పేట జిల్లాలోని తంగిడిలో ఎంటర్ అవుతుందని పేర్కొన్నారు. గత పదేళ్లుగా గత పాలకుల నిర్లక్ష్యంగా ఉండటం వల్ల అన్యాయం జరిగిందని వివరించారు. నదుల విషయంలో గతంలో అన్యాయం జరిగిందని, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా న్యాయం జరగలేదన్నారు. పొతిరెడ్డిపాడు కేపాసిటీని 44 వేల క్యూసెక్కుల నుంచి 92 వేల క్యూసెక్కుల వరకు జీవో 203 ఇచ్చి.. జగన్ ప్రభుత్వం పెంచిందని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో 3 టీఎంసీ రోజుకు అక్రమంగా తరలించారు. తెలంగాణకు గ్రావిటి ద్వారా రావాల్సిన నీరు అక్రమంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు సైలెంట్‌ అప్రూవల్‌తో ఏపీ మార్చుకున్నదని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం మొదలైందన్నారు. కేసీ కేనాల్‌కు వెయ్యి క్యూసెక్కులు, మల్యాల దగ్గర 6,300కు పెంచారన్నారు. ఉమ్మడి రాష్ట్రం కంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతానికంటే కృష్ణా నదీ జలాల విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపించారు.

50 శాతం ఎక్కువ వాటర్ ఆంధ్ర తీసుకపోయారు

2004 నుంచి 2014 వరకు అక్రమంగా శ్రీశైలం రిజర్వాయర్ 10,655 టీఎంసీలు వస్తే.. 727 టీఎంసీలు ఔట్ సైడ్ డైవర్ట్ అయ్యాయని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014 నుంచి 24 వరకు శ్రీశైలం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 8,993 టీఎంసీ ఉంటే 1200 టీఎంసీలు డైవర్ట్ అయ్యాయని ఆరోపించారు. గత పదేళ్ల కంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 50 శాతం ఎక్కువ వాటర్ ఆంధ్రవాళ్లు తీసుకపోయారన్నారు. దీంతో తెలంగాణకు ఇన్‌ఫ్లో తగ్గిందని, డైవర్షన్ పెరిగిందన్నారు.

డిండి లిఫ్ట్ ఇరిగేషన్

ఎస్ఎల్‌బీసీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టెంపాడు ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం మొదలైంది. కానీ కేంద్ర ప్రభుత్వం ముందు 225 టీఎంసీకి వాటర్ క్లైం చేయలేదని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి స్కీం ముందు 2 టీఎంసీ అని జీవో ఇచ్చి 1 టీఎంసీ చేశారన్నారు. 27,560 కోట్లు ఖర్చుపెట్టి.. ఇప్పటి వరకు ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు క్రియేట్ చేయలేదన్నారు. మరి కృష్ణా నదీ జలాలపై మరి నల్గొండలో సభలు పెట్టుకున్న ఏమీ ప్రయోజనమని మంత్రి విమర్శించారు.

Advertisement

Next Story