రుణమాఫీ కాని రైతులకు బిగ్ అలర్ట్.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-13 13:05:54.0  )
రుణమాఫీ కాని రైతులకు బిగ్ అలర్ట్.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రైతు భరోసా(Rythu Bharosa)పై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao) కీలక ప్రకటన చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి పంట వేసిన రైతులకే రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు. అలాగే పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే రుణమాఫీ చేశామని తెలిపారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు ఈ నెలాఖరులోపు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరాకు రూ.7500 చొప్పున రెండు విడతల్లో ఏడాదికి రూ.15,000 అందించాల్సి ఉంది.

కాగా, ప్రభుత్వం మూడు విడతల్లో రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేసింది. ఫస్ట్ ఫేజ్‌లో లక్ష రూపాయల వరకు పంట రుణాలున్న 11,14,412 మంది రైతులకు, సెకండ్ ఫేజ్‌లో జూలై 30న లక్షన్నర రూపాయల వరకు పంట రుణాలున్న 6,40,823 మంది రైతులకు, థర్డ్ ఫేజ్‌లో రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాలున్న సుమారు ఆరు లక్షల మంది రైతాంగానికి ప్రభుత్వం మాఫీ చేసినట్లు తెలిపింది. మూడు దశల్లో కలిపి మొత్తం 24 లక్షల మంది రైతులకు సుమారు రూ.19 వేల కోట్ల మేరకు మాఫీ ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed