రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పత్తి విత్తనాల కొరత ఉందనేది అవాస్తవమని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. బుధవారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై కావాలనే ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా క్యూలో చెప్పులు, పాస్ పుస్తకాలు పెట్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అసలు ఆదిలాబాద్‌లో రైతులపై లాఠీచార్జ్ జరుగలేదని అన్నారు. ఒకే బ్రాండ్‌కు చెందిన విత్తనాలు కావాలని రైతులు కోరడంతో ఇబ్బంది ఏర్పడిందని చెప్పారు. రుణమాఫీ విషయంలో ఆర్బీఐతో చర్చిస్తున్నట్లు తెలిపారు. కాగా, రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ.15 వేల పంట పెట్టుబడి సాయం, ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిన సగంతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారంటీల్లో భాగంగా పథకాలను ప్రకటించారు. అయితే ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటుతున్నా పథకాలను ఇప్పటి వరకు అమలు చేయలేదని విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. తాజాగా విపక్షాల ఆందోళనలు, రైతు రుణమాఫీపై మంత్రి తుమ్మల స్పందించి సమాధానం చెప్పారు.

Advertisement

Next Story