ప్రభుత్వం రెచ్చగొట్టే వ్యాఖ్యలు కరెక్ట్ కాదు: మంత్రి Talasani Srinivas Yadav

by Sathputhe Rajesh |   ( Updated:2022-09-05 14:33:46.0  )
ప్రభుత్వం రెచ్చగొట్టే వ్యాఖ్యలు కరెక్ట్ కాదు: మంత్రి Talasani Srinivas Yadav
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొందరు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి పండుగలను అడ్డం పెట్టుకొని మాట్లాడటం దుర్మార్గపు ఆలోచన అని, ప్రభుత్వంను రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సమైక్యతను చాటి చెప్పేందుకు స్వాతంత్ర్య ఉద్యమ సమయం నుండే వినాయక చవితిని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లోని ఆదర్శనగర్ లో గల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం మీద బురద జల్లేందుకు అనేక అవాస్తవాలను మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. హైదరాబాద్ లో ఈనెల 9న నిర్వహించే వినాయక నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. హైదరాబాద్ లో, రాష్ట్ర వ్యాప్తంగా,హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 39 వేల గణపతి మండపాలు ఏర్పాటు చేశారని వెల్లడించారు. గ్రేటర్ లో వినాయక నిమజ్జనం కోసం 74 చిన్న చిన్న పాండ్ లు ఏర్పాటు చేశామన్నారు. పండుగలను రాజకీయాలకు వాడుకోవడం కరెక్ట్ కాదని హితవు పలికారు. తప్పుడు ప్రచారాలతో నిర్వహకులు ఆందోళనకు గురికావద్దని సూచించారు.

Next Story

Most Viewed