- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
T-Fiber: తక్కువ ధరకే! టీ-ఫైబర్ ఇంటర్నెట్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
దిశ, డైనమిక్ బ్యూరో: టీ-ఫైబర్ (T-Fiber) (Telangana Fiber Grid) సేవలను ఐటీ మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ప్రారంభించారు. దీని ద్వారా తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద 3 జిల్లాల్లోని ఒక్కో గ్రామంలో 4 వేల కుటుంబాలకు కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్, సంగారెడ్డి జిల్లా సంఘంపేట, నారాయణపేట్ జిల్లా మద్దూరు గ్రామాల్లో టీ ఫైబర్ నెట్ సర్వీసులు ప్రారంభం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో నిర్వహించిన ప్రజా విజయోత్సవాలు నిర్వహించారు. టీ ఫైబర్ సేవలపై సంగారెడ్డి జల్లా శ్రీరాంపూర్ వాసులతో మంత్రి ముచ్చటించారు. టీ ఫైబర్‌తో టీవీ, టెలివిజన్, కంప్యూటర్ సేవలకు ఉపయోగం ఉంటుందని మంత్రి తెలిపారు. చిన్న పరిశ్రమల కోసం కొత్త ఎమ్ఎస్ఎమ్‌ఈ పాలసీ తీసుకోచ్చామన్నారు. ఈ సేవలు కొన్ని సవరణల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.
నేటి నుంచి మీ సేవలో మరిన్ని సేవలు..
అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు మీ సేవ మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఇందులో మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చారు. మొబైల్ యాప్ ద్వారా 250కు పైగా సర్వీసులు లభ్యం అవుతాయని అధికారులు తెలిపారు. మరోవైపు రైతులకు రుణమాఫీ, బోనస్ కోసం మొబైల్ అప్లికేషన్ మంత్రి ప్రారంభించారు.
పలు సంస్థల ఒప్పందాలు
మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో పలు సంస్థల ఒప్పందాలు జరిగాయి. తెలంగాణలో రూ.1500 కోట్లతో లెన్స్‌కార్ట్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే సీతారాంపూర్‌లో సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు ప్రీమియర్ ఎనర్జీ లిమిటెడ్ ఎంఓయూ కుదుర్చుకుంది. డిఫెన్స్ రంగంలో పెట్టుబడులకు ప్రభుత్వంతో ఆజాద్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది.