తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి శ్రీధర్ బాబు శుభవార్త

by GSrikanth |
తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి శ్రీధర్ బాబు శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర నిరుద్యోగులకు ఆర్థికశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు. శుక్రవారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన జాతీయ యువజన దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి మంత్రి మాట్లాడారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ దిశగా ముందుకు వెళ్తున్నామని ప్రకటించారు. గత ప్రభుత్వం ఉద్యోగ భర్తీ పట్ల నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు.

ప్రైవేట్ రంగంలోని మరిన్ని లక్షల మందికి ఉద్యోగ కల్పనలో ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. రాబోయే ఐదేళ్లలో మానవ వనరుల రంగంలో తెలంగాణ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండబోతుందని తేల్చిచెప్పారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో డిగ్రీ చదువుకన్న వారికి సైతం ఒక ప్రత్యేక కోర్సు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. అంతేకాదు.. హైదరాబాద్ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడానికి ప్రతి జిల్లాలో స్కిల్ సెంటర్లు, స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని శ్రీధర్ బాబు ప్రకటించారు.

Advertisement

Next Story