- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అన్నా, చెల్లెలను కూడా చెడుగా చూస్తున్నారు.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: ‘సోషల్ మీడియా(Social Media) వల్ల నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నా ఫొటోలు మార్ఫింగ్ చేసి.. మానసిక వేధనకు గురి చేశారు. ఇవాళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ అంశంపై మాట్లాడటం చాలా రిలీఫ్‌గా అనిపించింది’ అని మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. శనివారం ఆమె అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. సోషల్ మీడియా పోస్టులు కొన్నిసార్లు తనను డీమోరల్ చేశాయని చెప్పారు. మహిళలు రాజకీయాల్లో ఎదగడమే కష్టం.. అలాంటిది తాము ఈ స్థాయికి వచ్చినా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ‘సోషల్ మీడియాను సోషల్ సర్వీస్‌కు వాడుకున్న నేను.. అంతే ఇబ్బందులకు గురయ్యాను. బీఆర్ఎస్(BRS) దీనిని కేవలం బురదజల్లేందుకే వాడింది’ అని సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు.
‘సోషల్ మీడియా కుటుంబాలను బజారుకీడుస్తుంది. బాడీ షేమింగ్(Body Shaming), ఫొటోలు మార్ఫింగ్(Photo Morphing), అననివి అన్నట్లుగా చెప్తున్నారు. గత సంవత్సరం నుంచి ఇది ఎక్కువ అవుతుంది. అన్నా, చెల్లెల్లు చేతిలో చెయ్యి వేసుకున్నా.. మరోకరకంగా చూపుతున్నారు. సోషల్ మీడియాను మంచికి వాడాలి.. చెడుకు కాదు.. కరోనా సమయంలో ఎంతో సర్వీస్ చేసా.. దాన్ని కూడా సోషల్ మీడియా(Social Media)లో నన్ను విమర్శించారు. అబద్దాల పైనే బీఆర్ఎస్ నడుస్తుంది. చివరకు నిజమే గెలుస్తుంది. సోషల్ మీడియా కట్టడి అవసరం. సోషల్ మీడియా ద్వారా మాపై బురద చల్లుతున్నారు.. కడుక్కోవడం మా వంతు అవుతుంది’ అని సీతక్క వాపోయారు.