- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Minister Ponnam Prabhakar : తార్నాక ఆస్పత్రిని సందర్శించిన మంత్రి పొన్నం
by Jakkula Mamatha |

X
దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో శనివారం నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలతో పాటు ఫిజియోథెరపీ యూనిట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, ఫార్మసీని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. తార్నాక ఆర్టీసీ ఆస్పత్రి వైద్యులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. సిబ్బందికి అందిస్తున్న వైద్య సేవల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మొక్కలు నాటారు. ఈ క్రమంలో చికిత్స కోసం వచ్చిన ఆర్టీసీ సిబ్బందితో ఆయన ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Next Story