Ponnam: బీసీ సంఘాలు, బీసీ మేధావులతో మంత్రి పొన్నం చర్చలు

by Prasad Jukanti |
Ponnam: బీసీ సంఘాలు, బీసీ మేధావులతో మంత్రి పొన్నం చర్చలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే (Caste Census) నివేదిక విషయంలో వ్యక్తమవుతున్న సందేహాలను నివృత్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా శనివారం రాష్ట్ర సచివాలయంలో బీసీ సంఘాలు, బీసీ మేధావులతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సమావేశం అయ్యారు. కుల గణన నివేదికపై బీసీ సంఘాలు, బీసీ మేధావులతో మంత్రి చర్చించిస్తున్నారు. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, బీసీ కమీషన్ చైర్మన్ నిరంజన్ , బీసీ కమిషన్ సభ్యులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య (R.Krishnaiah) బీసీ సంఘాల నేత జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకుళా భరణం కృష్ణ మోహన్ రావు, మాజీ ఐఏఎస్ చిరంజీవులు, పలువురు బీసీ సంఘం నేతలు, ఫ్రొఫెసర్లు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, తదితరులు హాజరయ్యారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed