కాలేజీ అమ్మాయిలతో మంత్రి మల్లారెడ్డి రచ్చ.. వీడియో వైరల్

by GSrikanth |   ( Updated:2023-10-10 14:50:09.0  )
కాలేజీ అమ్మాయిలతో మంత్రి మల్లారెడ్డి రచ్చ.. వీడియో వైరల్
X

దిశ, కూకట్‌పల్లి: ఆరోగ్యమే ఐశ్వర్యం, ఆరోగ్యమే మహా భాగ్యం, ఆరోగ్యంగా ఉన్న వారే ధనవంతులు అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మల్లారెడ్డి మల్టిస్పెషాలిటీ హాస్పిటల్​ఆధ్వర్యంలో వరల్డ్​హార్ట్​డే సందర్భంగా కూకట్‌పల్లిలోని అశోక వన్ మాల్​వద్ద 5కే వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి డీజే టిల్లు, టాప్​లేచిపోద్ది పాటలకు స్టేజీపై స్టెప్పులు వేశారు.

ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఆరోగ్యమే ఐశ్వర్యమని, ఆరోగ్యంగా ఉన్న వారే నిజమైన ధనవంతులని అన్నారు. ముఖ్యంగా గుండెను జాగ్రత్తగా చూసుకోవాలని, రోజు క్రమం తప్పకుండా వ్యాయమం చేయాలని, పౌష్టిక ఆహారం తీసుకోవాలని కోరారు. తాను 70 ఏండ్ల వయస్సులోను రోజు ఉదయమే వ్యాయమం, యోగా చేస్తానని, పౌష్టిక ఆహారం తీసుకుంటానని అన్నారు. ఐటీ ఉద్యోగులు, యువత స్ట్రెస్‌తో కూడిన ఉద్యోగాలలో ఉన్న వారు తప్పకుండా తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని కోరారు.

Advertisement

Next Story