బిగ్ న్యూస్: త్వరలోనే మరికొందరు BRS నేతలకు నోటీసులు.. మంత్రి KTR సెన్సేషనల్ కామెంట్స్..!

by Satheesh |   ( Updated:2023-03-10 04:02:29.0  )
బిగ్ న్యూస్: త్వరలోనే మరికొందరు BRS నేతలకు నోటీసులు.. మంత్రి KTR సెన్సేషనల్ కామెంట్స్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రం ఎప్పుడైనా దర్యాప్తు సంస్థలతో నోటీసులు ఇవ్వొచ్చు.. అందుకు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరికలు జారీ చేసింది. జాతీయ రాజకీయాలకు వెళ్తున్న క్రమంలో ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయని.. ఎమ్మెల్సీ కవిత నోటీసుతోనే ఆగిపోలేదని.. ఇంకా ఎక్కువగా ఉంటాయని మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలను, నేతలను అలర్ట్ చేశారు. మంత్రి వ్యాఖ్యలతో ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలు కలవరపాటుకు గురయ్యారు.

రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచడంతో పాటు వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే సుమారు 12 మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఐటీ, ఈడీ నోటీసు ఇచ్చి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసు ఇచ్చి విచారణకు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది.

ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్ సైతం పదే పదే కేంద్ర దర్యాప్తు సంస్థలను వేటకుక్కలతో పోలుస్తూ కామెంట్లు చేస్తున్న విషయం విధితమే. అయితే శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కవితతోనే సమస్య సమసి పోలేదు.. కేంద్ర దర్యాప్తు సంస్థల వేధింపులు ఉంటాయని కేటీఆర్ పేర్కొన్నారు. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరూ అలర్టు ఉండాలని ముందస్తుగా హెచ్చరించినట్లు స్పష్టమవుతోంది.

ఎప్పుడైనా ఏ వ్యాపార లావాదేవీలపైనైనా దాడులు జరిగే అవకాశం ఉందని.. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న కొద్ది దర్యాప్తు సంస్థలు స్పీడ్ పెంచుతాయని పార్టీ అధిష్టానం భావిస్తుంది. అందుకు అలర్టు అయిన బీఆర్ఎస్.. నేతలకు ఏ గడ్డుకాలం ఎదురైనా సిద్ధంగా ఉండాలని సూచిస్తూ సన్నద్ధం చేస్తుంది.

నేతల్లో కేటీఆర్ వ్యాఖ్యల గుబులు..

గతంలో ఎప్పుడు లేని విధంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతుండటంతో బీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తమైంది. అందుకు అడ్డుకట్ట వేసేందుకు సన్నద్ధమవుతుంది. అందులో భాగంగానే కేంద్రం దర్యాప్తు సంస్థలు విపక్షాల నేతలను టార్గెట్ చేస్తూ భయబ్రాంతులకు గురిచేయాలని, లోబర్చుకోవాలని చూస్తున్నాయని ఆరోపణలు చేస్తుంది. అందులో భాగంగానే కవితకు ఈడీ లిక్కర్ స్కాంలో నోటీసు ఇచ్చిందని మండిపడుతున్నారు.

అయితే మీడియా సమావేశంలో కేటీఆర్.. కవిత తర్వాత కూడా వేధింపులు ఉంటాయని తెలుసు అని పేర్కొనడంతో బీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలైంది. ఎవరికి కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి నోటీసులు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. కవితకు అంటే పార్టీ అండగా ఉంటుందని, తమకెవరు అండగా ఉంటారనే ఏ ఇద్దరు నేతలు కలిసినా చర్చించుకుంటుండటం హాట్ టాఫిక్‌గా మారింది. ఏదీ ఏమైనా కేటీఆర్ వ్యాఖ్యలు పార్టీనేతలను ముందస్తుగా సన్నద్ధం చేస్తున్నట్లు స్పష్టమవుతుంది.

Advertisement

Next Story

Most Viewed