Jupally Krishna Rao: వడ్డీలు కట్టేందుకే మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది

by Gantepaka Srikanth |
Jupally Krishna Rao: వడ్డీలు కట్టేందుకే మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది
X

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల బీఆర్ఎస్(BRS) పాలనపై మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం ఆయన అచ్చంపేట(Atchampeta)లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్(BRS) చేసిన అప్పులు, తప్పిదాల వలన నెలకు రూ.6 వేల కోట్ల అప్పులు కడుతున్నామని మండిపడ్డారు. వడ్డీలు కట్టేందుకే మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు హైదరాబాద్ ORRను 35 ఏళ్లకు అమ్మేసిందని కీలక వ్యాఖ్యలు చేశారు.

గత ప్రభుత్వ పథకాలు ఎత్తివేయకుండా రూ.18 వేల కోట్లతో రుణమాఫీ చేస్తున్నామని జూపల్లి స్పష్టం చేశారు. గత పాలకులు ధనిక రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల రాష్ట్రంగా ఈ ప్రభుత్వానికి అప్పుల చిప్ప ఇచ్చిందని, అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story